SOURCE :- BBC NEWS
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
7 జనవరి 2025
ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్లో వస్తువులు, సేవల ఖరీదు ఎక్కువగా ఉంటున్నాయని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది.
కొన్ని నెలలుగా పలువురు నెటిజన్లు తాము ఫలానా వస్తువు కొనాలనుకున్నప్పుడో, లేదా తాము ఫలానా సర్వీసు తీసుకోవాలనుకున్నప్పుడో ఐఫోనులో ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒకలా ధరలు ఉంటున్నాయనీ, ఐఫోనులో ధరలు ఆండ్రాయిడ్ కంటే ఎక్కువగా ఉంటున్నాయనీ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించే పలువురు సోషల్ ఇన్ఫ్లూయన్సర్లు కూడా ఈ విషయంపై రీల్స్ చేయడంతో అది మరింత హాట్ టాపిక్‌గా మారింది. మరి ధరల విషయంలో నిజంగానే ఆండ్రాయిడ్, ఐఫోన్లలో తేడా కనిపించిందా?
ఇలా రెండు వేరు వేరు ఫోన్లలో వేరు వేరు ధరలు చూపుతున్నాయనే విషయంపై ఇక్కడ పొందుపరిచిన మూడు ట్వీట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పెద్ద చర్చ లేపాయి. ఆయా కంపెనీలు దానిపై వివరణ కూడా ఇచ్చాయి.
స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాలనుకుంటే రెండు ఫోన్లలో వేర్వేరు ధరలు ఉన్నాయని ఒకరు, ఉబర్ ద్వారా వెహికల్ బుక్ చేసుకుందామంటే రెండు రకాల ఫోన్లలో వేర్వేరు ధరలు ఉన్నాయని మరొకరు, ఫ్లిప్ కార్టులో సూట్‌కేస్ కొనాలనుకుంటే రెండు ఫోన్లలో వేర్వేరు ధరలు ఉన్నాయని మూడో వ్యక్తీ… వేర్వేరు సందర్భాల్లో పెట్టిన పోస్టులు ఇవి. లక్షలాది మంది వీటిపై చర్చించారు.
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది, 1
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది, 2
ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Twitter ముగిసింది, 3
ది నరేన్ నెట్వర్క్, విదుల్ ప్రోతి అనే రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో ఇదే విషయంపై పోస్ట్ చేసిన ఒక వీడియో, దేశంలో బాగా వైరల్ అయింది. ఆ అకౌంట్లోని మిగతా వీడియోలతో పోలిస్తే, ఈ వీడియోకు భారీ వ్యూస్ కూడా వచ్చాయి.
నవంబర్ 22న చేసిన ఆ వీడియోను ఏకంగా కోటీ 20 లక్షల మంది చూశారు.
ఇది ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ధరల తేడాలపై దేశవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని సూచిస్తోంది. ఇదే అంశంపై చార్టెడ్ అకౌటెంట్ సార్థక్ అహూజా కూడా ఒక వీడియో చేశారు.
బీబీసీ పరిశీలనలో ఏం తేలిందంటే..
మరి ఇంత చర్చ జరుగుతున్న అంశంలో వాస్తవం ఎంత అని బీబీసీ స్వయంగా పరిశీలించినప్పుడు తేడా తెలియలేదు.
మేక్ మై ట్రిప్ ద్వారా హోటల్ గదులు, ఉబర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, మింత్రా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా వివిధ వస్తు సేవల ధరలను బీబీసీ పోల్చి చూసింది.
బీబీసీ ఈ యాప్‌లన్నింటినీ ఐఫోన్ 13, రెడ్ మీ కే 20 ప్రో (ఆండ్రాయిడ్) అనే రెండు ఫోన్లలో వేసింది. ప్రతీ యాప్‌లోనూ రెండేసి వస్తువుల, సేవల ధరలను పోల్చి చూసింది. స్టార్ హోటల్ గదుల నుంచి కాయగూరల వరకూ అన్నీ చూసింది. ఆశ్చర్యకరంగా రెండు ఫోన్లలోనూ ధరల్లో ఎటువంటి తేడాలూ చూపించలేదు.
కేవలం ఉబర్ మాత్రమే తన ధరల్లో తేడాలు చూపించింది. అది స్వల్పమైన తేడా. కేటగిరీలను బట్టి గరిష్టంగా 50 రూపాయల వరకూ తేడా వచ్చింది.
అయితే అదే ఉబర్ సేవలు శాంసంగ్ ఎస్ 22 అల్ట్రా (ఆండ్రాయిడ్) ఫోనులో వేసినప్పుడు కూడా మరో ఆండ్రాయిడ్ ఫోన్ కంటే భిన్నమైన ధరలు వచ్చాయి.
కాబట్టి ఉబర్ ధరలు పూర్తిగా ఐఫోన్ – ఆండ్రాయిడ్ల మధ్య మారుతున్నాయని చెప్పడానికి లేదు.అదే సమయంలో మిగతా యాప్స్‌ను బీబీసీ పరిశీలించిన వస్తు సేవల ధరల్లో పెద్ద మార్పు కనపడలేదు.
వ్యూహం మార్చుకున్నాయా?
అయితే బీబీసీకి ఈ తేడా దొరకకపోవడానికి మరో కారణం కూడా ఉండవచ్చు. ఒకటి సోషల్ మీడియాలో ఈ రకమైన చర్చ పెరిగిన తరువాత వివిధ ఆన్లైన్ వ్యాపార సంస్థలు తమ వ్యూహం మార్చుకుని తాత్కాలికంగానో, శాశ్వతంగానో ఈ ధరల తేడాలను ఆపి ఉండవచ్చు.
లేదా సరిగ్గా బీబీసీ చూసిన వస్తుసేవలు మాత్రమే ఒకలా ఉండి, ఇతర వస్తువుల ధరల్లో తేడాలు ఉండవచ్చు. మొత్తానికి కారణాన్ని బీబీసీ స్వతంత్రంగా నిర్ధారించలేదు.
అయితే ఒకటి మాత్రం నిజం, బీబీసీ పరిశీలనలో ప్రత్యక్షంగా దొరకకపోయినా, పెద్ద సంఖ్యలో భారతీయ వినియోగదారులకు ఈ తేడా అనుభవంలోకి వచ్చిన విషయం సాక్ష్యాలతో సహా ఉంది.
ఆఖరికి కొత్త ఏడాది వేడుకల సందర్భంలో కూడా డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకూ హోటల్ గదుల విషయంలో ఈ ధరల తేడా కనిపించిందని పలువురు పోస్టులు పెట్టారు. హోటల్ గదుల విషయంలో దాదాపు 20 శాతం వరకూ ధరల తేడా ఉందని వారు చెప్పారు.
‘‘డీవీడీల ప్రయోగంతో దొరికిపోయిన అమెజాన్’’
వస్తు సేవల్లోనే కాదు, డబ్బు పెట్టి కొనుగోలుచేసే ప్రీమియం యాప్ సేవల్లో కూడా ఈ తేడాలు ఉన్నాయి.
యూట్యూబ్ ప్రీమియం వంటివి ఐఫోన్లో కాస్త ఎక్కువ ధర ఉంటున్నాయి. అయితే ఐఫోన్ యాప్ స్టోర్‌లో యాప్ ఉండాలంటే ఆ సంస్థకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువ కావడంతో ఆ ధరల తేడా ఉంటుందని పలువురు నిపుణులు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆ తేడా మరీ అంత పెద్దది కాదు. కానీ, మరికొన్ని సందర్భాల్లో భారీ తేడా ఉంటోంది.
”ఈ ధరల వ్యత్యాసం అనేది భారతదేశంలో వందల ఏళ్ళ నుంచి ఉన్నదే. మన సంతల్లో, దుకాణాల్లో, కొనడానికి వచ్చే వారిని చూసి, వారికి వస్తువు మీద ఉన్న అవసరం, ఆసక్తిని గమనించి ధర చెప్పడం కనిపిస్తుంటుంది. దానికి ప్రతిగా బేరం ఆడతారు. కానీ ఆన్‌లైన్‌తో సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు మన కొనుగోలు పద్ధతులు, కొనుగోలు చరిత్ర, ఫోను కంపెనీ, మన ఆర్థిక సామర్థ్యం ఇలాంటి మన సొంత డేటా వాడుకుని, ధరలు పెంచి చెప్పినా, మనం బేరం ఆడలేని స్థితిలో ఉంటాం. అది కస్టమర్లకు ఎక్కువ బాధ. ఇలాంటివి బయట పడినప్పుడు మాత్రం ఆయా కంపెనీల పేరు పోతుంది, విమర్శలూ వస్తాయి.2000వ సంవత్సరంలో డీవీడీ ధరల ప్రయోగంతో అమెజాన్ దొరికిపోయింది” అని బీబీసీతో చెప్పారు చెన్నైలోని గ్రేట్ లీక్స్ ఇన్స్టిట్యూట్లో యూనియన్ బ్యాంక్ ఛైర్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనమిక్స్ విద్యా మహంబారే.
కస్టమర్లను వదులుకోలేకే ఈ ట్రిక్కులా?
ఈ సమస్య కేవలం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా ఉంది. అమెరికాలో డోర్ డాష్ అనే సంస్థపై స్థానికులు ఒకరు కేసు పెట్టారు.
ఆండ్రాయిడ్ యూజర్లతో పోలిస్తే, ఐఫోన్ యూజర్ల దగ్గర ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు అంటూ 2023 మేలో కోర్టులో కేసు వేశారు.
నిజానికి ఇలా ఒకే వస్తువు లేదా సేవకు వేర్వేరు చోట్ల లేదా వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ధరలు పెట్టడాన్ని అకేషన్ బేస్డ్ ప్రైసింగ్ అండ్ ప్రమోషన్ ఫర్ కన్జూమర్ గూడ్స్” అంటారని చెప్పారు సార్థక్ అహూజా.
ఉదాహరణకు ఒకే వస్తువును బయట షాపుల్లో ఒక ధరకూ, విమానాశ్రయాల్లో మరో ధరకూ, మల్టీప్లెక్సుల్లో మరో ధరకూ అమ్మే విధానం దీనికి ఒక ఉదాహరణ.
అయితే ధరల్లో ఈ వ్యత్యాసాలకు అనేక కారణాలు ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.
వీటిని ప్రైస్ డిస్క్రిమినేషన్, కస్టమర్ సెగ్మెంటేషన్ అని కూడా అంటారు. ఉదాహరణకు తరచూ వాడే వారికి డిస్కౌంట్లు ఇవ్వడం, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులకు ఇచ్చే డిస్కౌంట్లు కూడా ఇందులోనే భాగం. అలాగే ఒక్కోసారి తక్కువ ధర చెల్లించడానికి మొగ్గు చూపే కస్టమర్లను వదులుకోవడానికి ఇష్టపడక వారికి తక్కువ ధర చూపించే విధానాలు కూడా ఉంటాయి.
మన ఫోన్ ఆధారంగానే ధరల నిర్ణయమా?
”ఇది చాలా సంక్లిష్టమైనది. మనం వాడుతున్న ఫోన్ ఆధారంగా కూడా ధర నిర్ణయం అవుతుంది. కానీ, ఫోన్ ఆధారంగా మాత్రమే నిర్ణయం కాదు. అందులో చాలా అంశాలు పనిచేస్తాయి. ఈ పెద్ద కంపెనీలు చాలా సమాచారం సేకరిస్తాయి. అందుకు చాలా రహస్య మార్గాలు కూడా అనుసరిస్తాయి. మన వ్యక్తిగత వివరాలు, మన నివాస ప్రాంతం, మనం వాడే ఐపీ అడ్రస్, గతంలో మన కొనుగోళ్లు, మన ఆదాయం, మన ఇతర కొనుగోళ్లు, వీటన్నింటి ఆధారంగా ఇది నిర్ణయం అవుతుంది.ఇక సర్జ్ ప్రైసింగ్ అంటే ప్రాంతం సమయాన్ని బట్టి పెరిగేది.. ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటూ ఆపిలా, ఆండ్రాయిడా అనేది కూడా ఒకటి” అని బీబీసీతో అన్నారు బెంగళూరుకు చెందిన ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌లో అసోసియేట్ పాలసీ కౌన్సిల్ కార్తీక రాజమోహన్.
”ధరల మార్పును నిర్ణయించే అనేక సాధనాల్లో మొబైల్ లేదా లాప్టాప్ అనేది ఒక కారణం మాత్రమే. ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యాధునిక కంప్యూటర్ ఆల్గారిథంలు లొకేషన్, బ్రౌజింగ్ హిస్టరీ, కొనే సమయం ఇలా చాలా అంశాల ఆధారంగా ధర నిర్ణయిస్తాయి. ఇక క్యూఆర్ కోడ్ పరిజ్ఞానంతో కూడా ధరలు తరచూ మారవచ్చు” అన్నారు విద్యా మాహంబారే
సర్వేలూ కారణమా?
ధర మార్పు వాస్తవం కానీ, అందుకు ఫోన్ ఒక కారణం కావచ్చు, కాకపోనూ వచ్చు అన్నది నిపుణుల మాట. వ్యాపార సంస్థలు ధరల విషయంలో ఇంకా చాలా ట్రిక్కులు చేస్తాయని కూడా కార్తీక వివరించారు.
”వారు టార్గెటెడ్ ప్రైసింగ్ పెడతారు. అంటే మీ కొనుగోలు సామర్థ్యం, నేపథ్యం ఆధారంగా వారు ధర పెడతుంటారు. ఫ్లాష్ సేల్ అని పెడతారు. ఇన్ని గంటల్లో కొనకపోతే ఆఫర్ ఉండదు అంటారు. అలాంటి ఎన్నో వ్యూహాల మధ్య ఆపిల్ – ఆండ్రాయిడ్ ఒకటి” అన్నారు కార్తీక రాజమోహన్.
దాంతో, అటువంటి అధ్యయనాల ఆధారంగా కూడా ధరల నిర్ణయం ఉండవచ్చు
చట్టం సంక్లిష్టం
అయితే ఇది అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద వస్తుందా రాదా అన్న విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
భారతదేశంలో వినియోగదారుల కోసం కఠినమైన చట్టాలు ఉన్నాయి. కానీ, ఆన్లైన్ సర్వీసుల విషయంలో ఆ చట్టాల అమలు చాలా సంక్లిష్టమైనది అంటున్నారు నిపుణులు.
”ఈ అంశంపై లీగల్ మెట్రాలజీ చట్టాలు వర్తిస్తాయి. వాటి ప్రకారం ప్యాక్ చేసిన ఏదైనా వస్తువుకు వేర్వేరు ఎమ్మార్పీ ధరలు పెట్టడం నేరం. కానీ, అది ఉన్నదున్నట్టు సేవా రంగానికి వర్తించదు.
అయితే తాజాగా ఈ చర్చ పెరిగిన నేపథ్యంలో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ఈ ఐఫోన్, ఆండ్రాయిడ్ అంశాన్ని విచారణకు తీసుకుంది. వారు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
అయితే, ఇది కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఉన్నది. ఇప్పుడు ఈ సంస్థలు సెంట్రల్ కన్జూమర్ రైట్స్ సంస్థ ముందూ, అవసరమైతే కోర్టుల ముందు కూడా పెద్ద లాయర్లను దించి వాదనలు వినిపిస్తాయి. అప్పుడు కోర్టులు ఈ అంశాన్ని ఎలా చూస్తాయనే దాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది” అని బీబీసీతో అన్నారు కార్తీక రాజమోహన్.
పరిష్కారం లేదా?
ఇలా ధరల వ్యత్యాసం ఉండటం పూర్తిగా చెడ్డ విషయమేమీ కాదంటున్నారు నిపుణులు.
“అయితే దీనివల్ల తక్కువ ఆదాయం ఉన్న కస్టమర్లకు లాభం కూడా జరగవచ్చు. ఎందుకంటే వారి ఆదాయాన్ని బట్టి ఆల్గారిథం వారికి తక్కువ ధర చూపిస్తుంది. కానీ, అదే సమయంలో ఎక్కువ ఆదాయం ఉన్న కస్టమర్ ఈ అధిక ధరలను తప్పించుకోవడానికి మార్గాలు వెతకడం కూడా అలవాటు చేసుకోవచ్చు. అంటే వేర్వేరు ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌ల్లో ధరలు చూసి పోల్చడం, సెట్టింగుల్లో కుకీస్ క్లియర్ చేయడం వంటివన్నమాట. అప్పుడు బహుశా కంపెనీలు ఇలాంటి పద్ధతులు మార్చుకునే అవకాశం ఉంది. కానీ దానివల్ల ఒక సమస్య కూడా ఉంది. అందరు కస్టమర్లకీ ఒకే ధర చూపించడం మొదలు పెడితే, తక్కువ ఆదాయ వర్గాలకు కూడా అదే ధర ఉంటుంది. దాని వల్ల వారికి ఇబ్బంది” అన్నారు విద్యా మాహంబారే.
ప్రస్తుతానికి ఏదైనా వస్తువు, సేవకు ఎక్కువ ధర చెల్లించకుండా ఉండాలి అనుకుంటే ఒకటే మార్గం, వేర్వేరు డివైజ్‌లలో దాని ధర పోల్చి కొనడమే!
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS