SOURCE :- BBC NEWS

పాప్‌కార్న్ తింటున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

కొత్త సంవత్సరం రాగానే చాలా మంది తమ అలవాట్లు, పద్ధతులు మార్చుకోవాలని తీర్మానం చేసుకుంటారు.

అయితే ఈ తీర్మానాల్లో 75రోజుల వ్యాయామం జాబితాలో అగ్రస్థానంలో ఉండకపోవచ్చు.

కానీ ఈ సంవత్సరం మాత్రం అదే వైరల్‌గా మారింది. వ్యాయామంలో తమ పురోగతి గురించి తెలియజేయడానికి నెటిజన్లు టిక్‌టాక్ ఉపయోగిస్తున్నారు. (భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఉంది)

75 హార్డ్ ఛాలెంజ్‌ను అనేక మంది తమ కొత్త సంవత్సర తీర్మానంగా తీసుకొని, పాటించి చూపిస్తున్నారు కూడా.

అసలేంటి 75 హార్డ్? దీని నియమాలేంటి? దీని వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? దీన్ని మీరు కూడా పాటించగలరా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

75 కఠిన నియమాలు

75 రోజులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు, మద్యానికి దూరంగా ఉండాలి.

75 రోజుల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండు సార్లు 45 నిమిషాల సేపు వ్యాయామం చేయాలి. ఈ రెండు వ్యాయామాల్లో ఒకటి ఇంటి బయటెక్కడైనా చేయాలి. ఉదాహరణకి పార్క్, జిమ్ లేదా ఆరుబయట ప్రదేశంలో చేయాలి. రోజు 3 లీటర్ల మంచినీళ్లు తాగాలి. ఒక నాన్ ఫిక్షన్ పుస్తకాన్ని ప్రతీ రోజూ కనీసం 10 నిమిషాలు చదవాలి.

ఇవన్నీ తేలికే అనిపిస్తోందా? అసలు నిజంగా ఇది ఎలా ఉంటుందన్నది ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేసినవారు చెబుతున్నారు. ఇది కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, కాస్త ఉపశమనం కలిగించడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

75 హార్డ్ పూర్తిచేసిన దేవాంశ

ఫొటో సోర్స్, Devamsha Gunpu

‘నేను అధిగమించిన సవాళ్లు’

29 ఏళ్ళ దేవంశా గున్‌పుత్ గత మార్చిలో 75 హార్డ్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.

ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో డిజిటల్ కన్సల్టెంట్‌గా పని చేస్తూనే ఆమె ఇది సాధించారు.

”ఇది కచ్చితంగా కష్టమైనదే” అని ఆమె బీబీసీతో చెప్పారు. పైగా నేను నివసించేది చీకటిగా, చల్లగా, తడిగా ఉండే ఎడిన్‌బర్గ్‌లో. ఇలాంటి వాతావరణంలోనే ఒక వర్కౌట్ బయట చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ మొత్తంలో నాకు అత్యంత కష్టంగా అనిపించిన విషయం మాత్రం నేను ఇంటికి వెళ్ళి నా కుటుంబంతో సమయం గడిపేటప్పుడు డైట్‌ను క్రమశిక్షణతో పాటించడం.

‘రోజుకి రెండు సార్లు వ్యాయామం చేయడం, కఠినంగా ఒక డైట్ ను పాటించడం నాకు కొత్త విషయాలు. కాబట్టి వీటిని పాటించడం నాకు ఇబందిగా అనిపించింది’ అని ఆమె అన్నారు.

అయితే ఈ ఛాలెంజ్ పూర్తి చేసినప్పటి నుంచి దాని ప్రభావాలను తనలో ఇప్పటికీ గమనిస్తున్నానని దేవంశా అన్నారు.

‘ఇప్పుడు నేను దాదాపు ప్రతి రోజూ వ్యాయాయం చేస్తాను. నా ఆహార అలవాట్లు మెరుగుపడ్డాయి. పుస్తాకాలు చదివే పద్ధతిలో కూడా మార్పు వచ్చింది’ అని ఆమె అన్నారు.

సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఊపందుకుంది కొన్నివారాలే అయినప్పటికీ, పుట్టింది మాత్రం 2019లో. రచయిత, పాడ్‌కాస్టర్ ఆండీ ఫ్రిసెల్ల ఈ ఛాలెంజ్‌ను రూపొందించారు.

”మానసిక దృఢత్వాన్ని సాధించే మార్గాలు కనుక్కోవడానికి నేను 20 ఏళ్ళు కృషి చేసాను. ఈ ఛాలెంజ్‌ను తయారుచేయడంలో ఆ అనుభవాన్ని ఉపయోగించా” అని ఆయన చెప్పారు.

ఆయన పర్సనల్ ట్రైనర్‌నో, డాక్టర్‌నో కాదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలనేదానిపై సూచనలు చేయడం లేదు. అయితే సమతుల్య ఆహారం అంటే ఏమిటో అర్ధం చేసుకోలరు.

ఈ ఛాలెంజ్ మరీ కఠినంగ అనిపించినావారికి సులభమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 75 సాఫ్ట్, 75 మీడియం లాంటి ఛాలెంజ్ లల్లో వ్యాయామం చేస్తూ, పుస్తకాన్ని చదువుతూ, అప్పుడప్పుడు మద్యం సేవించచ్చు, జంక్ ఫుడ్ తినచ్చు.

75 హార్డ్ పూర్తిచేసిన 27 ఏళ్ళ సోఫీ డీకిన్స్

ఫొటో సోర్స్, Sophie Deakins

స్నేహితులు, బంధువులకు దూరంగా…

27 ఏళ్ళ సోఫీ డీకిన్స్ కూడా ఈ ఛాలెంజ్ ను గత సంవత్సరం పూర్తి చేశారు. ఆమె లండన్ సినిమా సంస్థలో ఒక అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.

తన రోజువారీ జీవితంలో క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం కష్టంగా మారడంతో ఈ ఛాలెంజ్ ను స్వీకరించానని ఆమె అన్నారు.

తన ఆహారంలో ప్రొసెస్డ్ షుగర్‌ను పూర్తిగా తీసుకోడం మానేశారు. చాక్‌లెట్లు, స్వీట్లు, కాఫీలు ఆపేశారు.

పండ్లు, తేనె వంటివి మాత్రమే తిన్నారు.

తనకు కావాల్సిన ఆహారం మొత్తం ఇంటి దగ్గరే తయారుచేసుకున్నారు. యాప్ ఉపయోగించి తాను తీసుకునే ప్రొటీన్, తాగే నీరు ఎంత మోతాదులో ఉందో చూసుకున్నారు.

ఛాలెంజ్ నియమాలను నిబద్ధతతో పాటించినప్పుడల్లా తనకి తాను చిన్న చిన్న కానుకలను ఇచ్చుకుంటే ఉండేవారు సోఫీ.

తన గోర్లని అలంకరించుకోవడం, ఒక కొత్త పుస్తకాన్ని కొనుక్కోవడం లాంటివి.

కానీ నేను ఎదురుకున్న పెద్ద సవాలు మాత్రం నలుగురితో కలవడం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో, బయట ఆహరం తినడం, మద్యం తాగడం వంటివి చేయాల్సివస్తుంది. కానీ నేను పాటిస్తున్న పద్ధతుల గురించి అందరికి ముందుగానే చెప్పాను. అందువల్ల బయటకి వెళ్ళినప్పుడు, మద్యం తాగాలని, జంక్ ఫుడ్ తినాలనే ఒత్తిడి నుంచి తప్పించుకున్నాను’ అని ఆమె అన్నారు.

ఛాలెంజ్ పూర్తయినప్పటి నుంచి దానిలోని కొన్ని నియమాలను సోఫీ ఇంకా పాటిస్తున్నారు.

బయట ఆహరం తినకపోవడం, అనవసరంగా కేకులు, కాఫీలు కొనకపోవడం లాంటి పద్దతులను ఆమె ఇంకా ఆచరిస్తున్నారు. దీని వాళ్ళ నేను డబ్బును చాలా ఆదాచేసుకుంటున్న అని ఆమె అన్నారు.

అత్యంత ముఖ్యమైన విషయం మాత్రం నా ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. ఇది నేను చేయగలను అనుకోవడమే నాకు పెద్ద ప్రోత్సాహం. నాకున్న సాకులన్నీ తొలగిపోయాయి. అని సోఫీ అన్నారు.


టానా వన్

ఫొటో సోర్స్, Tana von Zitzewit

ఛాలెంజ్ లాభనష్టాలు

ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ ను ఆచరించాలనుకుంటే అంత సులువు కాదు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి చేయచ్చని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ టానా అంటున్నారు.

దీనికి చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. పుస్తకాన్ని చదవడం, 45 నిమిషాలు వ్యాయామం చేయడం ఇవన్నీ సమయం తో కూడుకున్న పనులు. ప్రత్యేకించి కొత్త సంవత్సరం సమయంలో తమ జీవితాలలో మార్పులు తీసుకురావాలనే ఒత్తిడి ఉంటుంది. కానీ ఇవన్నీ అసాధ్యమైన పనులైతే కావు. మీరు చేసే పనులని ఇష్టపడుతూ చేస్తే ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగలరు అని ఆమె అన్నారు.

వైద్య కోణంలో ఇది ఎంత వరకు లాభదాయకమో స్పష్టం చేయడం కష్టం. దీని మీద ఎటువంటి అధ్యయనాలు జరగలేదు కాబట్టి 75 హార్డ్ మీ జీవితాన్ని మార్చగలదా అంటే ఖచ్చితంగా చెప్పలేము.

కేవలం బయటకి వెళ్లి కాస్త శరీరంలో చురుకుదనాన్ని పెంచేందుకైతే ఈ ఛాలెంజ్ ఉపయోగపడుతుంది. కానీ వారంలో 3 సార్లు జిమ్‌కి వెళ్లడం, ఒకసారి పరిగెత్తడం, ఆరోగ్యమైన ఆహారాన్ని తినడం లాంటి పద్ధతులకన్నా ఇది మెరుగైన ఫలితాలను ఇస్తుందా అంటే నేను కాదనే అంటాను అని ఎన్ హెచ్ ఎస్ జనరల్ ఫిసీషియన్ సామ్ వైట్ మ్యాన్ అన్నారు.

ఇలాంటి టార్గెట్ పెట్టడం ‘75 హార్డ్’ లక్ష్యం కాదని ఫ్రిసెల్లా అన్నారు. బరువు తగ్గించే ఎలాంటి విధానాలను ఆయన ఇందులో ఉంచలేదు.

ఈ విధానం పాటించేవాళ్లు ప్రతిరోజూ టిక్ టాక్ ఫోటోలు తీసుకోవడం ద్వారా, ఆ వ్యక్తి ఎలా ఫీలవుతున్నారు, ఎలా కనిపిస్తున్నారు తెలుస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)