SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ బంధం ముగిసిపోతోందా? ఒకరినొకరు బెదిరించే స్థాయిలో మాటల యుద్ధానికి ఎందుకు దిగారు?
వీరి బంధం చెడి, మాటల యుద్ధం మొదలైనప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా అని ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తోంది. కానీ ఇదైతే అంత అద్భుతంగా ఉండదు.
డోనల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వద్ద ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్దఎత్తున గళం వినిపించగల సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాలు మాటల యుద్ధంగా మారి, ఒకరిని మరొకరు అవమానపరుచుకుని, హెచ్చరించుకునే స్థాయికి చేరాయి.
మస్క్ స్పేస్ఎక్స్ ప్రొగ్రామ్‌కు ప్రాణాధారమైన అమెరికా ప్రభుత్వంతో చేసుకున్న భారీ వ్యాపార ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
”మా బడ్జెట్లో బిలియన్ డాలర్ల డబ్బును ఆదా చేసుకునే తేలికైన మార్గం.. ఎలాన్ మస్క్‌కు ఇస్తున్న ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులను రద్దు చేయడం అని” ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.

అసలేం జరిగింది?
ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ బిల్లు విషయంలో తాను తీవ్రంగా ‘నిరాశచెందా’ అని వ్యాఖ్యానించిన మరుసటి రోజే మస్క్, ట్రంప్ పరిపాలన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) నుంచి వైదొలిగారు.
తరువాత ట్రంప్ బడ్జెట్ బిల్లును తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా చురుకైన ప్రచారం కూడా చేస్తున్నారు.
గురువారం, వైట్ హౌస్‌లో జర్మనీ ప్రధానిని కలిసినప్పుడు, మస్క్ మీద తన నిరాశను బహిరంగంగానే అధ్యక్షుడు వ్యక్తం చేశారు.
మస్క్ తనకు మద్దతుగా లక్షల డాలర్లను ఇవ్వకపోతే, గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవాడినని అనడాన్ని ట్రంప్ కొట్టేశారు.
ఎలక్ట్రిక్ వెహికిల్ ట్యాక్స్ క్రెడిట్స్‌ను రద్దు చేయాలని రిపబ్లికన్ల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తన టెస్లా కార్ల కంపెనీ దెబ్బతింటుందని మస్క్ స్వరం మారుస్తున్నారని ట్రంప్ చెప్పారు.
తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో మస్క్ కు మతిస్థిమితం లేకుండా పోయిందని మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను కట్ చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ క్రమంలో టెస్లా షేర్ల ధర గణనీయంగా 14శాతం పడిపోయింది.

ఫొటో సోర్స్, Reuters
మస్క్‌కు నష్టం తప్పదా?
ఒకవేళ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాగాన్ని మస్క్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా చేస్తే టెక్ బిలినీయర్కు తీవ్ర నష్టం తప్పదు. టెస్లా స్టాక్ ధర గురువారం 14 శాతం వరకు పడిపోయింది.
అయితే, ఈ హెచ్చరికలన్నీ ఒక వైపు నుంచే కాదు. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల తర్వాత, ట్రంప్ అభిశంసనకు మస్క్ పిలుపునిచ్చారు. తన కంపెనీలకు నిధులు తగ్గించే ధైర్యం చేసి చూపించమని సవాలు విసిరారు.
తన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను డీకమిషనింగ్ చేస్తానంటూ మస్క్ హెచ్చరించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోమగాములను, ఇతర సరఫరాలను తీసుకెళ్లేందుకు ఈ స్పేస్క్రాఫ్ట్పైనే అమెరికా ఆధారపడింది.
ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్లను తిరిగి భూమి పైకి తీసుకొచ్చింది స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్నే.
”కారు రాయితీలను నేను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ లోటును తగ్గించాలనుకుంటున్నా. గత ఏడాది నేను చేసిన సాయానికి ట్రంప్ కృతజ్ఞతతో లేరు. నేను లేకపోతే డెమొక్రాట్లు గెలిచేవారు.” అంటూ మస్క్ రాసుకొచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
గురువారం మధ్యాహ్నం మస్క్ మరో పోస్టు చేశారు. ”నిజమైన అతిపెద్ద బాంబు”ను వేసే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేశారు. చనిపోయిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి విడుదల కాని పత్రాలలో ట్రంప్ కనిపిస్తాడంటూ ఆధారాలు చూపకుండా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
మస్క్ ఆరోపణలపై వాషింగ్టన్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు.
”తనకు కావాల్సిన విధానాలను చేర్చలేదన్న కారణంతో ఒక అతిపెద్ద అద్భుతమైన బిల్లుపై అసంతృప్తిగా ఉన్న ఎలాన్ మస్క్ నుంచి వ్యక్తమవుతోన్న దురదృష్టకరమైన సంఘటన ఇది.” అని అన్నారు.
అధ్యక్షుడు ఈ చరిత్రాత్మక బిల్లును ఆమోదించి, మన దేశాన్ని తిరిగి ఉన్నతంగా మార్చాలనుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని సృష్టించే సమయం ఆసన్నమైందా? అని మస్క్ పోల్ పెట్టారు. ఈ పోల్‌కు అనూహ్య సంఖ్యలో ఓట్లు పోలవుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS