SOURCE :- BBC NEWS

కైలాసపట్నం గ్రామానికి చెందిన సురేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ‘బీబీసీ’తో చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల పరిహారం అందించనున్నట్లు హోం మంత్రి చెప్పారు.

కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న ఈ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.

పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

కొందరి కాళ్లు చేతులు తెగిపడ్డాయని మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

ఫొటో సోర్స్, UGC

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో పాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

కోటవురట్ల మండల కేంద్రం నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కైలసపట్నంలో ఉన్న ఈ బాణసంచా కర్మాగారంలో తారాజువ్వలు, ఇతర మందుగుండు సామగ్రి తయారు చేస్తుంటారు.

నిరంజన్ రెడ్డి, రేంజ్ ఫైర్ ఆఫీసర్

పేలుడు ధాటికి తయారీ కేంద్రం మొత్తం కుప్పకూలిపోయి, మంటల్లో కాలిపోయింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పేలుడు సమాచారం అందగానే తమ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారని.. సుమారు 50 మంది సిబ్బంది మంటలు ఆర్పారని రేంజ్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఈ ఫైర్ క్రాకర్ యూనిట్ దగ్గరే డెయిరీ ఫాం కూడా ఒకటి ఉండడంతో గడ్డి వాములు ఉన్నాయని.. వాటికి మంటలు అంటుకున్నాయని చెప్పారు.

ఈ తయారీకేంద్రానికి నిర్వహణ అనుమతులు ఉన్నాయని నిరంజన్ రెడ్డి చెప్పారు.

యజమానుల్లో ఒకరు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.

బాణసంచా తయారీ కేంద్రం

పొలాల్లో పనిచేసుకుంటున్నామని, ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని.. పరుగుపరుగున ప్రమాద స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని గ్రామానికి చెందిన సురేశ్ ‘బీబీసీ’తో చెప్పారు.

చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో అక్కడంతా భయానకంగా ఉందని సురేశ్ చెప్పారు.

ప్రమాదం తరువాత గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడు అనకాపల్లి కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు.

‘‘ అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోం మంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించాను. ’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’ అని ఏపీ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS