SOURCE :- BBC NEWS

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్

ఫొటో సోర్స్, Getty Images

50 నిమిషాలు క్రితం

క్రిమినల్ గ్యాంగుల బెడద కారణంగా హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్ నగరంలో నిరాశ్రయులైన వారి సంఖ్య 2023తో పోలిస్తే 2024లో 87 శాతం పెరిగిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) తెలిపింది.

హైతీలో హింస వల్ల ఇంత ఎక్కువ మంది నిరాశ్రయులు కావడం ఇదే తొలిసారి.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్

ఫొటో సోర్స్, Getty Images

అంతర్యుద్ధం కారణంగా పది లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. 2023 డిసెంబర్‌లో 3 లక్షల 15 వేల మంది బలవంతంగా తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. హైతీ జనాభాలో ఇది 9 శాతం. వీరిలో సగం మందికి పైగా చిన్నారులు ఉన్నారు.

“హైతీలో ఇప్పటివరకు 10 లక్షల 41 వేల మంది నిరాశ్రయులయ్యారని లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి” అని ఐవోఎం ప్రతినిధి కెన్నెడీ ఒకోత్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్

ఫొటో సోర్స్, Getty Images

దాదాపుగా నగరం మొత్తం క్రిమినల్ గ్యాంగుల ఆధీనంలో ఉంది. దీంతో నగరంలో వైద్య సేవలు ఆగిపోయాయి. ఆహారం దొరకడం లేదు. నిరాశ్రయులైన వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు వలసవెళ్లారు. అక్కడ వనరులు పరిమితంగా ఉన్నాయి.

గ్యాంగులు నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇళ్లు మాత్రమే కాదు, పోలీస్ స్టేషన్లు కూడా ఖాళీగా మారాయి.

పిల్లలు, టీచర్ల భద్రతకు తాము హామీ ఇవ్వలేమంటూ బెల్ ఎయిర్ కమ్యూనిటీ స్కూల్‌ను మూసివేశారు. మిగతా స్కూళ్ల పరిస్థితి కూడా ఇదే.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

పోర్ట్ ఔ ప్రిన్స్‌లో అతిపెద్ద మురికివాడ క్లైట్ సొలైల్‌లో గ్యాంగుల మధ్య ఘర్షణ వల్ల అధికారులు అక్కడి ఆసుపత్రిని మూసివేశారని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ తెలిపింది.

2024 మార్చి- ఏప్రిల్ మధ్య ఇక్కడ హింస పెరగడంతో అప్పుడు పోర్ట్ ఔ ప్రిన్స్ విమానాశ్రయాన్ని మూడు నెలలపాటు మూసివేశారు.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇళ్లను వదిలేసి వెళ్లిన వారు ఇతర ప్రాంతాల్లో ఆశ్రయం పొందడానికి, ఎక్కడైనా ఆశ్రయం దొరికినా అక్కడ ఆరోగ్య సమస్యలు, భద్రత లేమి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఐవోఎం తెలిపింది.

గతేడాది గ్యాంగుల గొడవల వల్ల 5,600 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది.

క్రిమినల్ గ్యాంగుల్లో పని చేస్తున్న వారిని, వారికి సంబంధించిన వారిగా ఆరోపిస్తూ 315 మందిని బహిరంగంగా కొట్టి చంపినట్లు సమితి మానవ హక్కుల కార్యాలయం లెక్కల్లో నమోదు చేసింది.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

2024 జూన్‌లో ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ దేశాలకు సంబంధించిన భద్రతా బలగాలు హైతీకి వచ్చాయి. నగరంలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు వీరు ప్రయత్నించినప్పప్పటికీ నగరం మీద గ్యాంగుల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టలేకపోయాయి.

హైతీ పోలీసులకు అంతర్జాతీయ బలగాలు అండగా నిలిచాయి. అయినప్పటికీ హైతీ పోలీసులను నిధుల కొరత, ఆయుధాాల కొరత వేధిస్తున్నాయి.

గ్యాంగుల వద్ద భారీగా ఆయుధాలున్నాయి. దీంతో వీరిని ఎదుర్కొనేందుకు హైతీ పోలీసులకు కష్టంగా మారింది.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఇదిలా ఉంటే, హైతీలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఎన్నికల నిర్వహణ కోసం 2024 నవంబర్‌లో ఏర్పడిన అధ్యక్ష మండలి సంక్షోభంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మండలి ఇప్పటి వరకు ఎన్నికల తేదీని ప్రకటించలేదు.

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

Haiti, Port-au-Prince, Conflict, అంతర్యుద్ధం, సంఘర్షణ, క్రిమినల్ గ్యాంగ్స్, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, స్కూళ్లు

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)