SOURCE :- BBC NEWS

బీబీసీ ISWOTY 2024 నామినీ మను భాకర్ గురించి ఈ విషయాలు తెలుసా?

44 నిమిషాలు క్రితం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అయిదో ఎడిషన్ నామినీల పేర్లను ప్రకటించారు. అయిదుగురు నామినీలలో షూటర్ మను భాకర్ ఒకరు.

మను భాకర్ 2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు తన పిస్టల్ పనిచేయకపోవడంతో పతకం చేజారింది. ఆ తర్వాత 2024 ఒలింపిక్స్‌లో ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు.

2018లో, షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన అతిపిన్న వయసు భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ నిలిచారు. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే.

ఆమెకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న లభించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)