SOURCE :- BBC NEWS

భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ (డీజీసీఏ) దేశంలోని 32 విమానాశ్రయాల నుంచి పౌరవిమాన రాకపోకలను నిషేధించింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈమేరకు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), సంబంధిత అధికారులకు నోటామ్ ( నోటీస్ టు ఎయిర్ మెన్) జారీ చేసింది.
దీని ప్రకారం మే 15వ తేదీ ఉదయ 5గంటల 29 నిమిషాల వరకు నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
విమానరాకపోకలు నిషేధం విధించిన విమానాశ్రయాలలో ఉధంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, భటిండా, భుజ్, బికనేర్, ఛండీగఢ్, హల్వారా, హిండాన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేషోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి, లేహ్, లుధియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ , సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ ఉన్నాయి.
విమానయాన మంత్రిత్వశాఖ నోటీసుల ప్రకారం జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, ఛండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌కు మే 15 ఉదయం 5.29 గంటల వరకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.