SOURCE :- BBC NEWS

చార్మినార్ పరిధి

ఒక గంట క్రితం

హైదరాబాద్ నగరంలో చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌ లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించినట్టు తెలంగాణ అగ్నిమాపక డైరక్ట్ జనరల్ నాగిరెడ్డి ప్రకటించారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెప్పారు.

Press note

ఫొటో సోర్స్, ANI

ఆదివారం ఉదయం 6 గంటల 16 నిమిషాల సమయంలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తా వద్ద జీ+2 భవనంలో మంటలు చెలరేగాయని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

fire accident

ఫొటో సోర్స్, screengrab

ముందు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయని, తరువాత పై అంతస్తుకు పాకాయని చెప్పారు.

మొదటి అంతస్తులో 17మంది చిక్కుకుపోయారని,అగ్నిమాపక సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబో, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడి, మంటలను అదుపులోకి తేవడానికి 2గంటల సమయం పట్టిందని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఇరుకు దారి

మృతులలో 8మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. వీరంతా పదేళ్లలోపు పిల్లలేని ఫైర్ సర్వీస్ డైరక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియాకు చెప్పారు.

‘‘బిల్డింగ్ పురాతనమైనది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు చాలా సన్నని దారిమాత్రమే ఉంది. లోపల రెండు షాపులు ఉన్నాయి. అన్నీ దగ్ధమైపోయాయి. దాంతోపాటు నివాస సముదాయం కూడా ఉంది. దీంతో మొదటి, రెండో అంతస్తులకు వెళ్లే దారి ఏమాత్రం సరిపోనిదిగా ఉంది. లోపలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోయింది’’ డీజీ చెప్పారు.

ప్రమాదానికి షార్ట్ సర్యూటే కారణమని తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి

పోస్ట్‌ X స్కిప్ చేయండి

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

హైదరాబాద్‌లోని అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

హైదరాబాద్ అగ్ని ప్రమాదం

మెరుగైన వైద్యం అందించండి: సీఎం

సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఘటనాస్థలిని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ”గుల్జార్ హౌస్‌ సమీపంలో దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ 17మంది ఉన్నారు. వారిలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ ప్రభుత్వ చేస్తోంది” అని చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)