SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, OmarAbdullah/X
22 నిమిషాలు క్రితం
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో అన్నారు.
“గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల మధ్య ఈ సాయంత్రం ఒక అవగాహన కుదిరింది. దీనిని గత కొన్నిగంటలుగా పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ చర్యలను తిప్పికొడుతోంది” అని ఆయన అన్నారు.
”దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటివి జరగకుండా పాకిస్తాన్ తక్షణ చర్యలు చేపడుతుందని భావిస్తున్నాం.” అని అన్నారు.
దీనిపై, పాకిస్తాన్ ఇంకా స్పందించలేదు.

సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయని, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దుల ఉల్లంఘనలను కఠినంగా ఎదుర్కోవాలని ఆదేశాలిచ్చినట్లు ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
కాల్పుల విరమణ ప్రకటన తర్వాత, జమ్మూకశ్మీర్‌లో పేలుళ్ల శబ్దాలు
కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ మధ్య అంగీకారం కుదిరినట్లు ప్రకటన వచ్చిన తర్వాత, శనివారం రాత్రి జమ్మూకశ్మీర్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు బీబీసీ ప్రతినిధులు చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురాలో గత అరగంట నుంచి కాల్పులు జరుగుతున్నాయని స్వర్ణ్ లాల్ అనే స్థానికుడు చెప్పారని బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య తెలిపారు.
“సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి, పదిహేను నిమిషాల్లో ఆగిపోయాయి. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత దాదాపు గంటసేపు ఎలాంటి శబ్దం లేదు. కానీ, ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి” అని స్వర్ణ్ లాల్ చెప్పారు.
రజౌరీలో సుందర్బనీకి చెందిన ఉషా దీది మాట్లాడుతూ, “గంటకు పైగా కాల్పులు జరుగుతున్నాయి. బోర్డర్‌కు కొద్దిగా దూరంగా ఉన్నప్పటికీ, మా టెర్రస్ మీదకెళ్తే పైనుంచి వెళ్తున్నవి కనిపిస్తాయి, పేలుళ్ల శబ్దాలు కూడా వినపడతాయి ” అని బీబీసీతో చెప్పారని దివ్య ఆర్య రిపోర్ట్ చేశారు.

ఫొటో సోర్స్, PIB/ You Tube
‘ఆర్ఎస్ పురాలో కాల్పుల శబ్దాలు’
ఆర్ఎస్ పురాలోనూ కాల్పుల శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పారని బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ తెలిపారు. 20 నిమిషాల కిందట పేలుళ్లు జరిగినట్లు ఒక వ్యక్తి చెప్పారని, దానికి సంబంధించిన వీడియోను రికార్డు చేసి, తనకు పంపినట్లు ఆయన చెప్పారు.
“కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత మేం మార్కెట్‌కి వెళ్లాం. ఇంతకుముందులా, దుకాణాలను మూసివేయమని పోలీసులు ఈరోజు దుకాణదారులకు చెప్పలేదు. మార్కెట్ దాటి 3,4 కిలోమీటర్లు వెళ్లాం. భారీగా కాల్పుల శబ్దాలు వినిపించాయి, వాటిని రికార్డు చేశాం” అని ఆర్ఎస్పురాకు చెందిన మనోజ్ బీబీసీ ప్రతినిధితో చెప్పారు.

ఫొటో సోర్స్, Omar Abdullah/facebook
‘ఇదేం కాల్పుల విరమణ’
దీనిపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే విషయమై ఎక్స్‌లో పోస్టులు చేశారు.
”ఇదేం కాల్పుల విరమణ, శ్రీనగర్‌లో పేలుళ్లు వినిపిస్తున్నాయి” అని ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
”ఇది కాల్పుల విరమణ కాదని, శ్రీనగర్ మధ్యలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి” అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అందులో, ఆకాశంలో కొన్ని శకలాల వెలుగులు కనిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
కచ్‌లో కొన్ని డ్రోన్లు కనిపించాయి: గుజరాత్ హోం మంత్రి
గుజరాత్‌లోనూ డ్రోన్లు కనిపించాయని ఆ రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో కొన్ని డ్రోన్లు కనిపించాయి. ప్రస్తుతం, అక్కడ పూర్తిస్థాయి బ్లాకౌట్ అమలు చేస్తున్నట్లు గుజరాత్ హోం శాఖ మంత్రి హరీష్ సంఘ్వీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 3
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)