SOURCE :- BBC NEWS

అజర్‌బైజాన్ విమానం

ఫొటో సోర్స్, Getty Images

52 నిమిషాలు క్రితం

కజకిస్తాన్‌లో 67 మంది ప్రయాణీకులతో కూడిన విమానం బుధవారం కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.

అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ ప్రయాణికుల విమానంలో అక్టౌ నగరానికి సమీపంలో మంటలు చెలరేగాయని, అయితే వాటిని ఆర్పివేశారని వారు వెల్లడించారు.

ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలతో బయటపడినట్లు ప్రాథమిక నివేదికలు సూచించాయని కజకిస్తాన్ ఎమర్జెన్సీ మినిస్ట్రీ తెలిపింది.

ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)