SOURCE :- BBC NEWS

నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్

ఫొటో సోర్స్, PA Media

ఒకపక్క గడ్డకట్టే చలి.. ఈ చలిలో ఎవరైనా ఒళ్లంతా కప్పి ఉంచేలా వెచ్చని వస్త్రాలు వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ, లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో, ప్యాంట్లు ధరించకుండా…ప్రజలు ట్యూబ్ రైళ్లల్లో ప్రయాణించారు.

లండన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నప్పటికీ ‘నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్’ వార్షికోత్సవాన్సి విజయవంతంగా నిర్వహించారు. స్త్రీ పురుష భేదం లేకుండా అంతా అండర్ వేర్‌లు, టాప్‌లు మాత్రమే ధరించి ట్యూబుల్లో కనిపించారు.

వెస్ట్‌మినిస్టర్, వాటర్‌లూ, సౌత్ కెన్సింగ్టన్ సహా పలు ప్రాంతాలను కలుపుకుని లండన్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌ అంతటా ట్రౌజర్స్ ధరించకుండా ప్రయాణించినవారు తారసపడ్డారు.

No Trousers Tube ride

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్‌లో ఏడుగురు వ్యక్తులు 2002 జనవరిలో మొదటిసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ ఈవెంట్, ఈ ఏడాది లండన్‌లో జరిగింది. దీనిలో డజన్ల కొద్ది ప్రజలు పాల్గొన్నారు.

”ఆనందం, ఉల్లాసం, ఏదో తెలియని అనుభూతిని కలిగించే అనూహ్యమైన క్షణాలను అందించే కార్యక్రమమే ఇది” అని ఈ కార్యక్రమ సృష్టికర్త చార్లీ టోడ్ బీబీసీకి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
No Trousers Tube ride

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఈ సంప్రదాయం కొనసాగుతుండటం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని టోడ్ చెప్పారు. ఇది ఎవరికీ హాని చేయని కాసింత సంతోషకరమైన క్షణం మాత్రమేనని తెలిపారు.

‘‘ప్రజలు యుద్ధ సంస్కృతులను ఇష్టపడే వాతావరణంలో మనం నివసిస్తున్నాం. న్యూయార్క్‌లో ఎప్పుడూ ఇతరులను ఆహ్లాదంగా ఉంచడం, ప్రజలను నవ్వించడమే నా లక్ష్యం’’ అని చార్లీ టోడ్ చెప్పారు.

‘‘ఇది రెచ్చగొట్టే లేదా ఎవరికైనా చికాకు పెట్టడానికి కాదు. అందుకే, ఈ స్ఫూర్తి ముందుతరాల్లో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నా.’’ అన్నారు చార్లీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)