SOURCE :- BBC NEWS
గాజా వీధుల్లో హమాస్ వ్యతిరేక నిరసనలు
48 నిమిషాలు క్రితం
అక్టోబర్ 7 దాడుల తర్వాత మొదటిసారి గత నెలలో గాజా ప్రజలు హమాస్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు.
వేలాది మంది గాజా ప్రజలు తమకు యుద్ధం , హమాస్ రెండూ వద్దంటూ భారీ నిరసన ప్రదర్శన జరిపారు.
నిజానికి గాజాలో హమాస్‌ను బాహాటంగా విమర్శించడం చాలా అరుదు.
హమాస్ వ్యతిరేకులను జైళ్లలో నిర్బంధించడం, హింసించడం, చంపేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి.
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 51 వేల మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన కొందరితో మాట్లాడిన బీబీసీ ప్రతినిది పాల్ ఆడమ్స్ జెరూసలేం నుంచి అందిస్తున్న కథనం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

ఫొటో సోర్స్, Getty Images