SOURCE :- BBC NEWS

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఓర్ఛా ప్రాంతంలో దాదాపు 50 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ బుధవారం చెప్పారు.

ఈ ఆపరేషన్‌లో 26 మందికి పైగా మావోయిస్టులు మరణించారని ఆయన తెలిపారు. అగ్ర నాయకత్వానికి చెందిన కొంతమంది మావోయిస్టులు చనిపోయినట్లు నివేదికలు వచ్చాయని ఆయన అన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు మరణించినట్లు వార్తలొస్తున్నాయి, అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మావోయిస్టు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

”సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ టెర్రర్ నుంచి విముక్తి కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని మంత్రి విజయ్ శర్మ అన్నారు.

గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని అన్నారు.

( ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)