SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
56 నిమిషాలు క్రితం
జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ పేలుళ్లకు పాల్పడినట్లు రిపోర్టులు అందుతున్నాయి.
జమ్మూ విమానాశ్రయానికి సమీపంలో 16 శకలాలు పడ్డాయని జమ్మూనగరంలోని గుజ్జర్ నగర్ వంతెన వద్ద ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో చెప్పారు.
అదే సమయంలో, విమానాశ్రయంలో పేలుళ్లు జరిగినట్లు భద్రతావర్గాలు ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు తెలిపాయి.
సైరన్లు మోగడంతో నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మార్కెట్లు మూతపడ్డాయని, జనం పరుగులు తీయడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షి బీబీసీకి తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 1
జమ్మూకశ్మీర్‌లో సైరన్లు మోగడంతో బ్లాక్‌అవుట్ అయిందని ప్రత్యక్షసాక్షి తెలిపారు.
జమ్మూ నగరం నుంచి సమాచారం అందుతోంది.
జమ్మూలో రక్షణ వ్యవస్థలను(డిఫెన్స్ సిస్టమ్స్)ను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు బీబీసీకి తెలిపాయి. నగరమంతటా సైరన్లు మోగుతున్నాయి.
పాకిస్తాన్ జమ్మూ లక్ష్యంగా డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ దళాలు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య చెబుతున్న వివరాల ప్రకారం.. జమ్మూలో అనేక చోట్ల ప్రజలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, నగరమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కఠువా ప్రజలకు రెండుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఇక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. కఠువా జమ్మూ నుంచి గంటన్నర ప్రయాణ దూరంలో ఉంటుంది. ప్రస్తుతం రెండు నగరాలు బ్లాక్‌అవుట్‌లో ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 2
జైసల్మేర్‌లో భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తానీ డ్రోన్లను అడ్డుకుంటున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నట్లు ఏఎన్‌ఐ జర్నలిస్టులు మాట్లాడుకోవడం ఆ వీడియోల్లో వినిపించింది.
జమ్మూ డివిజన్‌లోని సాంబాలో బ్లాక్‌అవుట్ అమల్లో ఉందని, సైరన్లు వినిపిస్తున్నాయని తెలిపింది.
చండీగఢ్‌లోనూ సైరన్లు మోగుతున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్ రద్దు
ఇదే సమయంలో, ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ను నిర్వాహకులు మధ్యలో నిలిపివేశారు.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను రద్దు చేసినట్లు క్రిక్ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది.
స్టేడియంలో సాంకేతిక కారణాలతో మ్యాచ్ రద్దయినట్లు జియో హాట్‌స్టార్ తెలిపింది.
(ఈ కథనం అప్డేట్ అవుతోంది)
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది, 3