SOURCE :- BBC NEWS

జెనిన్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు

13 నిమిషాలు క్రితం

‘ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌’లోని అతిపెద్ద శరణార్థి శిబిరాలలో ఒకటైన జెనిన్ క్యాంప్ ఏమాత్రం నివాసయోగ్యం కాని రీతిలో పూర్తిగా ధ్వంసమైందని జెనిన్ మేయర్ చెప్పారు.

జనవరిలో ఇజ్రాయెల్ సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత వేల మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు.

కొన్ని వందల ఇళ్లను సైన్యం కూల్చివేసింది. ఇది చాలా అసాధారణ చర్య అని యూఎన్ తెలిపింది.

అయితే, జెనిన్ క్యాంపులో ఉగ్రవాద స్థావరాలున్నాయని ఆరోపిస్తూ, వాటిని నాశనం చేయడానికే ఈ కూల్చివేతలు చేపట్టామని ఇజ్రాయెల్ అంటోంది.

జెనిన్ క్యాంపులో తన ఇంటిని కోల్పోయిన ఒక బాధితుడితో బీబీసీ మాట్లాడింది. బీబీసీ ప్రతినిధి ఇమిర్ నాదెర్ అందిస్తున్న కథనం.

ఇజ్రాయెల్, గాజా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)