SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, police_kaurdeep/Insta
ఒక గంట క్రితం
పంజాబ్‌కు చెందిన లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్ హెరాయిన్‌తో పట్టుబడి చర్చగా మారారు.
భటిండా జిల్లా పోలీసులు, యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బృందం గత బుధవారం సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో అమన్ దీప్ కౌర్‌ను అరెస్ట్ చేశారు.
రెచ్చగొట్టే పాటలకు రీల్స్ చేయడం ద్వారా ఈ మహిళా కానిస్టేబుల్ పంజాబ్‌లో ఫేమస్.
సుమారు 17 గ్రాముల హెరాయిన్‌తో అమన్‌దీప్ కౌర్ పట్టుబడినట్టుగా పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ప్రధాన కార్యాలయం) సుఖ్‌చైన్ సింగ్ గిల్ రిపోర్టర్లకు చెప్పారు.
ఈ విషయంపై భటిండా నగర డిఎస్పీ హర్బాన్స్ సింగ్ దలివాల్‌ను సంప్రదించగా, మహిళా కానిస్టేబుల్ తన ఎస్‌యూ వెహికల్‌లో డ్రగ్స్ తరలిస్తుండగా భటిండాలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
ఎన్‌డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


ఫొటో సోర్స్, police_kaurdeep/Insta
ఎవరీ అమన్‌దీప్ కౌర్
అమన్‌దీప్ కౌర్ పంజాబ్‌లోని భటిండా జిల్లా ఫతే సింగ్ వాలా గ్రామానికి చెందినవారు. మన్సా జిల్లాలో ఆమె కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని ఐజీ సుఖ్‌చైన్ సింగ్ చెప్పారు.
”కొన్ని రోజుల కిందటే ఆమె మన్సా నుంచి భటిండాకు తాత్కాలికంగా బదిలీ అయ్యారు” అని ఐజీ తెలిపారు.
డ్రగ్స్‌తో పట్టుబడటంతో ఆర్టికల్ 311 కింద అమన్‌దీప్ కౌర్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
సామాజిక మాధ్యమాలలో
అమన్‌దీప్ కౌర్ పంజాబ్ పోలీసు వర్గాలలో ‘ఇన్‌స్టా క్వీన్’గా పేరుగడించారు. పంజాబ్ పోలీసు యూనిఫామ్‌లో అనేక రీల్స్ చేసి, ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు.
దీంతోపాటు ఆమె దాదాపు ప్రతిరోజూ రంగురంగుల దుస్తులు ధరించి రెచ్చగొట్టే పాటలకు రీల్స్ చేసి అప్‌లోడ్ చేస్తుండేవారు.
అమన్‌దీప్ కౌర్ అరెస్ట్ అయిన తరువాత ఇన్‌స్టాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య ఒక్కరోజులోనే 15వేలకు పెరిగింది.
అమన్‌దీప్ కౌర్‌కు పెళ్ళయిందని, కొంతకాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, police_kaurdeep/Insta
వివాదాలతో సావాసం
పోలీసు యూనిఫామ్‌లో అమన్‌దీప్ కౌర్ వీడియోలు చేయడం ఇటీవల కాలంలో వివాదాన్ని రాజేసింది.
గతంలో డ్రగ్స్‌కు సంబంధించి ఆమెపై అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, సరైన ఆధారాలు లేక పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోలేదు.
భటిండా పోలీసులు ఆమెకు ప్రభుత్వాస్పత్రిలో డోప్ టెస్ట్ చేయించగా, ఫలితం నెగిటివ్ అని వచ్చింది.
అమన్‌దీప్ కౌర్ 2022లో కూడా వార్తలలో నిలిచారు. అప్పట్లో ఆమె భాటిండాలోని ఎస్ఎస్‌పీ ఆఫీసు ముందు విష పదార్థంలాంటిదాన్ని సేవించడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో ఆమె ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఆమె తీరుకు నిరసనగా సమ్మెలో వెళతామని వైద్యులు హెచ్చరించారు.
దీంతో డాక్టర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమెపై కేసు నమోదుచేసినట్టు పంజాబ్ పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, police_kaurdeep/Insta
‘‘తప్పుడు అభియోగాలు’’
అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్‌పోలీసులు భటిండాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఒకరోజు పోలీసు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు డిఎస్పీ దలీవాల్ చెప్పారు.
తనపై తప్పుడు అభియోగాలు మోపారంటూ తనను కోర్టులో హాజరుపరిచినప్పుడు అమన్‌దీప్ కౌర్ బిగ్గరగా అరిచారు.
అమన్‌దీప్ కౌర్ ఆస్తులపై కూడా విచారణ జరుగుతోందని, అక్రమాస్తులు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ సుఖ్‌చైన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)