SOURCE :- BBC NEWS

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

‘నేను రోజూ నిద్రలేవగానే సమోసాకు దండం పెడతా’

2 గంటలు క్రితం

కెనడా వాసి హర్‌పాల్ సింగ్ సంధూ తయారు చేసే సమోసాలు కెనడాలోనే కాకుండా అమెరికా, ఇతర దేశాల్లోనూ గుర్తింపు పొందాయి. హర్‌పాల్ భారత్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 1989లో కెనడా వెళ్లాక ఆయన సమోసా వ్యాపారం మొదలుపెట్టారు.

”సమోసా వ్యాపారం చేస్తామంటే నాన్నగారు అంగీకరించలేదు. ఇదేం పని. నేను నీకు చదువు చెప్పించి లాయర్‌ చేశాను. కానీ, నువ్వు పకోడా అమ్ముతావా అన్నారు. అయితే, కొన్నేళ్ల తర్వాత ఇప్పుడాయన మమ్మల్ని, మా వ్యాపారాన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆటోమేషన్ తర్వాత ఇది మా జీవితాన్నే మార్చేసింది. మేం సమోసాను పూజించే స్థాయికి చేరింది” అని హర్‌పాల్ అంటున్నారు.

ఆహారం, సమోసా, భారత్, కెనడా

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)