SOURCE :- BBC NEWS
పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి : ‘హఠాత్తుగా మిసైల్ వచ్చి పడింది’
ఒక గంట క్రితం
”నేను డాబా మీద పడుకున్నా. రెండు క్షిపణులు మా మీదుగా వెళ్లాయి. అకస్మాత్తుగా ఓ క్షిపణి భూమిని తాకింది. ఆ ప్రాంతం మొత్తం కరెంటు పోయింది. నిమిషం తర్వాత కరెంటు వచ్చింది. మరో క్షిపణి వచ్చి పడింది.
ఆ క్షిపణి తాకిన తర్వాత ఆకాశం ఎర్రగా మారింది. ఆ తర్వాత అదే తరహాలో దాదాపు నాలుగు దాడులు జరిగాయి. ఒక క్షిపణి మర్కజ్-ఐ-తైయబా మసీదుపై పడింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మసీదు వైపు పరుగులు తీశారు. భారత్ దాడి చేసిందని తర్వాత అర్థమైంది”
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులోని మురీద్కేకు దగ్గరలోని నంగల్ సహ్దాన్‌కు చెందిన ఆతిఫ్ చెప్పిన మాటలివి.
పూర్తి వివరాలు ఈ వీడియోలో..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)