SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై
అమెరికా స్పందిస్తూ.. ఇరు దేశాలు పరస్పర దాడులు మానుకోవాలని, దీనివల్ల ఎలాంటి పరిష్కారం లభించదని పేర్కొంది.
అమెరికా విదేశాంగ
శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాతో మాట్లాడుతూ..
హింస, సైనిక చర్య, యుద్ధం ఆగిపోవాలన్నదే అమెరికా సందేశమని బ్రూస్ అన్నారు. యుద్ధం వల్ల పరిష్కారం లభించదని మధ్యప్రాచ్యంలో
నిరూపితమైందన్నారు.
తరతరాలుగా కొనసాగుతున్న హింస,
సమస్యలను ఆపడానికి కొత్త ఆలోచనలు, దౌత్యం ఒక్కటే పరిష్కారమన్నారు.
భారత్- పాక్ మధ్య
మధ్యవర్తిత్వంపై టామీ బ్రూస్ స్పందిస్తూ.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత దేశాల నేతలు దౌత్యపరంగా లేదా
ఏ స్థాయిలో మాట్లాడినా, ఆ సమాచారాన్ని
పంచుకోం. ఇదే మా విధానం’’ అని తెలిపారు.
భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వాన్ని టామీ బ్రూస్ ధృవీకరించలేదు లేదా ఖండించలేదు.
అమెరికా విదేశాంగ
మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫోన్లో మాట్లాడారని
అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
ఉద్రిక్తతలను
తగ్గించాలని, హింసను ఆపాలని
రుబియో ఇరు దేశాల నాయకులను కోరారు.
ప్రత్యక్ష చర్చలకు కూడా ఆయన ప్రాధాన్యం
ఇచ్చారు.