SOURCE :- BBC NEWS
29 డిసెంబర్ 2024
2024 సంవత్సరం ముగియనుంది.. ఈ ఏడాది పొడవునా బీబీసీ న్యూస్ తెలుగు మీకు వివిధ కథనాలను అందించింది. వీటిల్లో పాఠకులు ఎక్కువగా చదివిన వాటిల్లో పది కథనాలను అందిస్తున్నాం.
‘స్త్రీ తన దుస్తులతో పాటు సిగ్గును కూడా విడిచేయాలి’ – సెక్స్ గురించి ప్రాచీన మహిళలు ఇలా మాట్లాడుకునేవారా?
మహిళల కోణంలో ఈ పురాతన ప్రపంచం ఎలా ఉండేదనే విషయాలను ఇటీవల విడుదలైన ఒక కొత్త పుస్తకం వెల్లడిస్తోంది.
మహిళా ద్వేషులైన పురుష రచయితల మూస సిద్ధాంతాలను తోసిపుచ్చుతూ, పురాతన కాలంలో సెక్స్ గురించి స్త్రీల అభిప్రాయాలు ఎలా ఉండేవనే విషయాలపై పుస్తక రచయిత డైసీ డన్ పరిశోధించారు.
క్రీస్తుపూర్వం 7వ శతాబ్దపు గ్రీస్ కవి సెమోనిడెస్ ఆఫ్ అమోర్గోస్ ప్రకారం.. ‘స్త్రీలు ప్రధానంగా 10 రకాలు. కష్టపడి పని చేసేవారు, సోమరిపోతులు, అత్యాశ కలిగిన వాళ్లు.. అంటూ పలురకాలుగా వారిని వర్ణించారు.
50 ఏళ్ల కిందట దొంగిలించిన 37 రూపాయలను, భారీ మొత్తంలో వడ్డీతో తిరిగిచ్చిన వ్యాపారవేత్త, అసలేం జరిగిందంటే..
కొలంబోలో ఉంటున్న సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులకు ఆరుగురు పిల్లలు. వీరిని కలిసేందుకు తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త రంజిత్ 2024 ఆగస్టులో అక్కడికి వెళ్లారు.
ఒక రెస్టారెంట్లో సుబ్రమణ్యం పిల్లలను కలిశారు. 1970ల్లో జరిగిన సంఘటన గురించి వారికి చెప్పారు రంజిత్. యాభై ఏళ్ల కిందట తాను దొంగిలించిన డబ్బులను వారికి తిరిగి ఇచ్చారు.
ఇంతకీ ఆ డబ్బులను ఆయన ఎందుకు దొంగిలించారు? తిరిగి ఎందుకు ఇచ్చారు? అసలు ఈ రెండు కుటుంబాలకు మధ్య సంబంధమేంటి?.
మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి?
మైగ్రెయిన్‌తో విలవిల్లాడుతున్న ఓ వ్యక్తి మెదడులో వైద్యులకు టేప్‌వార్మ్స్ కనిపించాయి.
ఇవి రిబ్బనులా చుట్టచుట్టుకుని ఉంటాయి. వీటినే బద్దెపురుగులని అంటారు.
ఇంతకీ అవి మెదడులోకి ఎలా వెళ్లాయి?. వైద్యులు ఏం చెప్పారు?.
వాసుకి ఇండికస్: 4.7 కోట్ల ఏళ్ళ నాటి అత్యంత పొడవైన పాము అవశేషాలు చెప్పే కథ ఏంటంటే…
గుజరాత్‌లోని కచ్ జిల్లా పంధారో ప్రాంతానికి సమీపంలోని ఒక లిగ్నైట్ గని నుంచి సేకరించిన కొన్ని శిలాజాలపై పురాతత్వ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ప్రపంచంలో ఇప్పటివరకూ వెలుగుచూసిన పాముల్లో అత్యంత పొడవైన పాము శిలాజం ఇదేనని తేలింది.
పాము పొడవు 10 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది 4.7 కోట్ల ఏళ్లనాటి ప్రాణి శిలాజమని వారు భావిస్తున్నారు.
ఓవర్సీస్ హైవే: ప్రపంచంలో 8వ వింత ఇదేనా?
సముద్రంలో నిర్మించిన 182 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీన్ని తేలియాడే రహదారి అని పిలుస్తారు.
నాలుగు వేల మంది ఆఫ్రికన్ అమెరికన్, బహామియన్, యూరోపియన్ వలసదారులు ఈ నిర్మాణంలో పనిచేశారు. వీరంతా కఠిన పరిస్థితుల్లో మొసళ్లు, తేళ్లు, పాములతో పోరాడుతూ దీని కోసం పని చేశారు. ఇంతకీ అంత కష్టపడి ఈ హైవే ఎందుకు నిర్మించారు? ఎవరి కోసం నిర్మించారు?
ఆరేళ్ల పిల్లలకూ పీరియడ్స్ ఎందుకు వస్తున్నాయి, కారణాలపై డాక్టర్లు ఏం చెబుతున్నారు?
మహారాష్ట్రకు చెందిన అర్చన భర్త ఒక రైతు. పొలంలో నిర్మించుకున్న చిన్న ఇంట్లో ఆ కుటుంబం నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరిలో కూతురు పెద్దది. అయితే, కూతురు తన వయసు కంటే పెద్దగా కనిపించడం ప్రారంభించడంతో ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు అర్చన. ఆ తర్వాతే ఆమెకు అసలు విషయం తెలిసింది.
దిల్లీకి చెందిన రాశి కూడా తన కూతురు శరీరంలో మార్పులను చూశారు, మొదట్లో వాటిని ఆమె సాధారణమైనవిగా పరిగణించారు. 40 కిలోల బరువున్న తన ఆరేళ్ల కూతురిని చూసి, ఆరోగ్యంగా ఉన్నట్లు భావించారు.
అయితే ఒకరోజు అకస్మాత్తుగా రాశి కూతురు రక్తస్రావంతో బాధపడింది. డాక్టర్ వద్దకు వెళ్లగా పాపకు రుతుక్రమం వచ్చినట్లు గుర్తించారు. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? ఆరేళ్ల పిల్లలకు కూడా పిరియడ్స్ ఎందుకు వస్తున్నాయి?
ఆమె 58 ఏళ్ల వయసులో మళ్లీ తల్లయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం వివరణ కోరింది
దివంగత పంజాబీ పాప్ సింగర్ శుభ్‌దీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో మరో బిడ్డకు జన్మనిచ్చారు. చరణ్ కౌర్ ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్జిలైజేషన్) విధానంలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు.
అయితే, పెద్ద వయసులో ఇలా పిల్లలను కనడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరణ కోరింది.
పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
ఇంట్లో నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి?
పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది?
బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే నిపుణులు చెబుతున్న చిట్కాలేంటి?
కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
మీకు ఏడాదికి కోటి 57 లక్షల రూపాయలు జీతం ఇస్తాం.. స్కాట్లండ్‌లోని అందమైన ప్రదేశానికి వెళతారా? అని అడిగితే మీరు ఏం చెబుతారు?
యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మారుమూల ప్రాంతంలోని హెబ్రిడెస్ దీవుల సముదాయంలో భాగమైన యిఇస్ట్, బెన్‌బెక్యుల దీవుల్లో పనిచేసే డాక్టర్లకు ఈ జీతం ఇస్తామని చెబుతున్నారు.
పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
పొట్టలోకి క్రిములు వెళితే అవి మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.
ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదంతో పాటు, అవయవాలకు నష్టం కలిగిస్తాయి. ఇంతకీ ఏలిక పాములు శరీరంలోకి ఎలా చేరతాయి?
ఈ క్రిములను ఎలా తొలగించుకోవాలి?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS