SOURCE :- BBC NEWS

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

2 గంటలు క్రితం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు.

గురువారం(26 డిసెంబరు 2024) తన ఇంట్లో మన్మోహన్ సింగ్ స్పృహ కోల్పోయారని, వెంటనే ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు.

రాత్రి 8.06గంటల ప్రాంతంలో ఆయన్ను ఎయిమ్స్‌లోని అత్యవసర సేవల విభాగానికి తీసుకొచ్చారని, వెంటనే చికిత్స అందిస్తూ ఆయన్ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు.

ప్రకటన

ఫొటో సోర్స్, ANI

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

పంజాబ్‌లో పుట్టి, కేంబ్రిడ్జిలో చదివి..

ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ యూనిర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు.

మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా పనిచేశారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయేపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా 2004లో ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి 2014 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా పనిచేశారు.

పీవీ నరసింహారావును ఆర్థిక సంస్కరణల పితామహునిగా భావిస్తారు. పీవీ విధానాల అమలులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. భారత్‌కు 13వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు.

  • 1982 నుంచి 1985వరకు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు.
  • 1985 నుంచి 1987 వరకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
  • 1991లోయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.
  • ఆర్థికమంత్రిగా పీవీ నరసింహరావు నామినేట్ చేసే సమయానికి మన్మోహన్ సింగ్‌ యూజీసీ చైర్మన్‌గా ఉన్నారు.
  • 1991 జూన్‌లో కేంద్రమంత్రి బాధ్యతలు స్వీకరిచింన మన్మోహన్ సింగ్ అదే ఏడాది అక్టోబరులో రాజ్యసభ ఎంపీ అయ్యారు.
  • అసోం నుంచి వరుసగా ఐదుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
  • 2019లో ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు.
  • ఇంగ్లీషు, ఉర్దూలో అనర్గళంగా మాట్లాడగల మన్మోహన్‌సింగ్ మేధావిగా గుర్తింపు పొందారు.
మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

‘భారత్‌ను ఏ శక్తీ ఆపలేదు’

1991లో తొలి బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బాగా ప్రాచుర్యం పొందాయి. ”సమయం వచ్చినప్పుడు ఏ శక్తీ ఆపలేదు. ప్రపంచంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా అవతరించడం అన్నది అలాంటి ఆలోచనే అని నేనీ సభకు చెప్పాలనుకుంటున్నా” అని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

1984 సిక్కుల ఊచకోతపై ప్రధానిగా మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పారు. ”సిగ్గుతో నా తల వంచుకుంటున్నా” అని ఆ సమయంలో మన్మోహన్ అన్నారు.

”నేను బలహీనమైన ప్రధాని అని నేననుకోవడం లేదు. ప్రస్తుతమున్న మీడియా, ప్రతిపక్షంకన్నా

చరిత్ర నాపై మరింత దయతో ఉంటుందని నేను నమ్ముతున్నా. రాజకీయ పరిమితుల మధ్య నేను చేయగలిగినదంతా నేను చేశాను” అని ఓ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ అన్నారు.

మన్మోహన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

అణుఒప్పందంపై రాజీనామాకు సిద్ధం

మన్మోహన్ సింగ్ రాజకీయజీవితంలో అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో భారత్, అమెరికా అణుఒప్పందం సమయం ఒకటి. ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్నిస్తుందని మన్మోహన్ సింగ్ నమ్మారు.

దీని కోసం అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

2020 ఫిబ్రవరి 17న హిందుస్థాన్ టైమ్స్‌లో ప్రచురితమైన వ్యాసంలో మాజీ ఆర్థిక సలహాదారు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఈ విషయాన్ని చెప్పారు.

తనను కలవాలని సోనియా మన్మోహన్‌కు కబురు పంపారని, అంతకుముందెప్పుడూ అలా జరగలేదని అహ్లువాలియా గుర్తుచేసుకున్నారు.

అణు ఒప్పందం కుదరకపోతే తాను రాజీనామా చేస్తానని మన్మోహన్ సింగ్ అన్నారని అహ్లువాలియా రాశారు.

అయితే రాజీనామా చేయకుండా మన్మోహన్‌ను ఒప్పించాల్సిందిగా సోనియా తనను కోరారాని అహ్లువాలియా తెలిపారు.

మన్మోహన్ సింగ్‌తో ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, x.com/narendramodi/

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 1

ప్రధాని మోదీ సంతాపం

మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తంచేశారు. తాను గుజరాత్ సీఎంగా, మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయం నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 2

దేశానికి తీరని లోటు : చంద్రబాబు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీవ్ర వేదన కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. 1991లో ఆర్థికమంత్రిగా సంస్కరణలు ప్రారంభించినప్పటి నుంచి ప్రధానమంత్రి దాకా దేశానికి ఆయన నిరుపమాన సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 3

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 3

రాహుల్ సంతాపం

మన్మోహన్ సింగ్‌జీ తన అద్భుతమైన మేథ, సమగ్ర దృక్పథంతో దేశాన్ని నడిపించారని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఆర్థిక అంశాలపై ఆయన అవగాహన దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు రాహుల్ గాంధీ.

మన్మోహన్ సింగ్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 4

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 4

ఆధునిక భారత రూపకర్త మన్మోహన్: రేవంత్ రెడ్డి

మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆర్థికవేత్త, సంస్కరణవాది, నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వమే అంతిమంగా భావించే మన్మోహన్ ఇకలేరని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆధునిక భారత్ రూపకర్తల్లో మన్మోహన్ ఒకరని ప్రశంసించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)