SOURCE :- BBC NEWS

మెస్సీ, రేవంత్ రెడ్డి, ఫుట్‌బాల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

21 నిమిషాలు క్రితం

మెస్సీ.. లియోనెల్ మెస్సీ వచ్చేస్తున్నాడు..

మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్‌లోనట…

ఇప్పుడు ఫుట్ బాల్ లవర్స్, ప్రత్యేకించి యూత్‌లో ఇదే డిస్కషన్.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేశారు.

ఫుట్ బాల్ క్రీడలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ… ఈ నెలలో ఇండియా టూర్‌కు వస్తున్నాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మెస్సీ, రేవంత్ రెడ్డి, ఫుట్‌బాల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Telangana cmo

సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో మెస్సీ టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్

‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) ఇండియా టూర్ 2025’ పేరుతో నిర్వాహకులు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం (డిసెంబరు 13)న హైదరాబాద్‌లో మెస్సీ పర్యటించబోతున్నారు. తన పర్యటనలో హైదరాబాద్‌ను కూడా చేర్చినట్లు మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇప్పటికే పోస్ట్ చేశారు.

మెస్సీకి స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి కూడా తన్ ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు.

శనివారం డిసెంబరు 13 రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడబోతున్నారు మెస్సీ.

సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో మెస్సీ టీమ్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది.

ఈ మ్యాచ్ కోసం రోజూ కొంత సమయంపాటు రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్‌డీ ఫుట్ బాల్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసినట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది.

ఆయన ఫుట్‌బాల్ సాధన చేస్తున్న విజువల్స్ కూడా సీఎంవో రిలీజ్ చేసింది.

మెస్సీ, రేవంత్ రెడ్డి, ఫుట్‌బాల్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Rachakondapolice

14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ

మెస్సీ తన టూర్‌లో భాగంగా మొదట శనివారం (డిసెంబరు 13)న కోల్‌కతాకు వస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, ముంబయి, దిల్లీలో కూడా మెస్సీ పర్యటన సాగబోతోంది.

మెస్సీ పర్యటనలో ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడటం, మ్యూజికల్ కన్సర్ట్‌లు, మీట్ అండ్ గ్రీట్, డిన్నర్ పార్టీలు వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నామని ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా చెప్పారు.

అయితే, మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయని ఫుట్ బాల్ లవర్స్ చెబుతున్నారు. హైదరాబాద్ ఈవెంట్‌కు 3,250 రూపాయల నుంచి రూ.18,000 వరకు ఈ రేట్లు ఉన్నాయి.

మెస్సీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇండియాకు వస్తుండటంతో ఫుట్ బాల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాత్రం చెప్పవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS