SOURCE :- BBC NEWS

బోవెల్ క్యాన్సర్‌

ఫొట ో సోర్స్, Getty Images

ఇంతకుముంద ు క్యాన్సర ్ అనగాన ే వయస ు పైబడిన వాళ్లక ే వస్తుందిల ే అనుకునేవాళ్లు. కాన ీ ఇప్పుడ ు వయసుత ో సంబంధ ం లేకుండ ా అన్న ి వయసుల వారిలోన ూ క్యాన్సర ్ లక్షణాల ు గుర్తిస్తున్నామంటున్నార ు డాక్టర్లు.

అద ే కోవలోక ి వస్తుంద ి బోవెల ్ క్యాన్సర ్ లేద ా కొలన ్ క్యాన్సర్. దీన్న ే పేగ ు క్యాన్సర ్ అన ి కూడ ా అంటారు.

సాధారణంగ ా 50 ఏళ్ల ు పైబడిన వాళ్లల ో కనిపించ ే పేగ ు క్యాన్సర ్ కేసుల ు ఇప్పుడ ు యువతల ో కూడ ా ఎక్కువగ ా కనిపిస్తున్నాయంట ూ లాన్సెట ్ విడుదల చేసిన తాజ ా నివేదిక చెబుతోంది.

కొలన ్ క్యాన్సర్‌ప ై లాన్సెట ్ సంస్థ తాజాగ ా 50 దేశాల్ల ో పరిశోధనల ు జరిపింది. 27 దేశాల్ల ో 25 నుంచ ి 49 ఏళ్ల వయస ు వారిల ో పేగ ు క్యాన్సర ్ కేసుల ు వేగంగ ా పెరుగుతున్నాయన ి ఈ పరిశోధనల ో వెల్లడైంది.

కొలన ్ క్యాన్సర ్ కేసుల ు యువతల ో ఎక్కువగ ా నమోదవుతున్న దేశాల్ల ో సంపన్న దేశాల ే ఎక్కువగ ా ఉన్నాయన ి కూడ ా ఈ నివేదిక చెబుతోంది.

ఆస్ట్రేలియా, జర్మనీ, ఐర్లాండ్, న్యూజీలాండ్, నార్వే, స్లొవేనియా, స్కాట్లాండ్, ఇజ్రాయెల్, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, చిలీ, ఇంగ్లండ్, అర్జెంటీనా, పూర్టోరీకోలల ో యువతల ో కొలన ్ క్యాన్సర ్ కేసుల ు వేగంగ ా పెరుగుతున్నాయని, అలాగ ే తక్కువగ ా నమోదవుతున్న దేశాల్ల ో భారత్, యుగాండాల ు ఉన్నాయన ి నివేదిక వెల్లడించింది.

భారత్‌ల ో తక్కువ కేసుల ు నమోదవుతున్నప్పటిక ీ గత రెండ ు దశాబ్దాలత ో పోలిస్త ే క్రమంగ ా పెరుగుతున్నాయన ి హైదరాబాద ్ జూబ్లీహిల్స ్ అపోల ో హాస్పిటల్స్‌ల ో ఆంకాలజిస్ట్‌గ ా పనిచేస్తున్న డాక్టర ్ అజయ ్ చాణక్య చెప్పారు.

గ్లోబోకాన్, జాతీయ క్యాన్సర ్ ప్రోగ్రామ ్ రిపోర్ట ు ప్రకారం.. 2000-2010 మధ్య ఏడాదిక ి 30, 000 నుంచ ి 40, 000 వరక ు కొత్త కేసుల ు నమోదయ్యాయి. 2010-2020 మధ్య ఈ సంఖ్య 50 వేల నుంచ ి 60 వేలక ు పెరిగింది. 2020 నుంచ ి 2022 మధ్య అంట ే కేవల ం రెండేళ్లలోన ే 70, 038 కొత్త కేసుల ు నమోదయ్యాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
బోవెల్ క్యాన్సర్

ఫొట ో సోర్స్, Getty Images

కొలన ్ క్యాన్సర ్ అంటే?

మన పొట్ట భాగంల ో చిన్న, పెద్ద పేగులుంటాయి. పెద్ద పేగ ు మన జీర్ణ వ్యవస్థల ో కీలకమైన భాగం. మన ం రోజ ూ తిన ే ఆహార ం జీర్ణమయ్యాక, మలినాల ు పెద్ద పేగ ు నుంచ ే బయటక ు వెళ్తాయి.

పెద్ద పేగ ు చివర ి భాగాన్న ి కొలన ్ అంటారు. ఈ కొలన ్ భాగంల ో చిన్న చిన్న కణతుల ు లేద ా గడ్డల్లాంటివ ి ఏర్పడతాయి. వాటిన ే వైద్య భాషల ో పాలిప్స ్ అంటారు.

ఈ పాలిప్స ్ కేన్సరస ్ పాలిప్స్‌గ ా మారడానిక ి సుమార ు 10 ఏళ్ల ు పడుతుంది.

కొలన్ క్యాన్సర్

ఫొట ో సోర్స్, Getty Images

గుర్తించడ ం ఎలా?

సరైన అవగాహన ఉంట ే దీన్న ి ముందుగ ా గుర్తించడ ం సాధ్యమ ే అంటున్నార ు వైద్యులు.

సరైన సమయంల ో కొలనోస్కోప ీ చేయించుకుంట ే కొలన ్ క్యాన్సర్‌న ి తొల ి దశలోన ే గుర్తించడమ ే కాకుండ ా దానిన ి నివారించ ే అవకాశాల ు 16 శాత ం వరక ు ఉన్నాయన ి లాన్సెట ్ అధ్యయన ం తెలిపింది.

40 ఏళ్ల ు దాటిన వ్యక్తుల ు కొలనోస్కోప ీ చేయించుకుంట ే మంచిదన ి డాక్టర్ల ు సూచిస్తున్నారు. శరీరంల ో ఏవైన ా కణతుల ు ఏర్పడిత ే అవ ి ప్రమాదకరంగ ా మారేలోప ే వాటిన ి తొలగించ ే అవకాశ ం ఉంటుంది.

కొలనోస్కోప ీ అనేద ి ఓ స్క్రీనింగ ్ ప్రక్రియ. దీన ి ద్వార ా పెద్దపేగున ు పూర్తిగ ా పరీక్షిస్తారు.

కొలన్ క్యాన్సర్

ఫొట ో సోర్స్, Getty Images

ఇల ా చేస్త ే బయటపడొచ్చు

కొలన ్ క్యాన్సర్‌న ు తొల ి దశలోన ే గుర్తించగలిగి, సరైన ట్రీట్‌మెంట ్ తీసుకుంట ే బయట పడొచ్చన ి ఏలూర ు జిల్లాక ు చెందిన 50 ఏళ్ల వెంకటేష ్ అంటున్నారు. ఆయన ఇంతకుముంద ు క్యాన్సర్ ‌ నుంచ ి కోలుకున్నారు.

వైద్యుల ు చెప్పిన దాన్న ి తూచ ా తప్పకుండ ా పాటించడంత ో పాట ు మళ్ల ీ కొలన ్ క్యాన్సర ్ బారిన పడకుండ ా జీవన శైలిల ో మార్పుల ు చేసుకోవాలన ి ఆయన చెప్పారు.

రోజ ూ వ్యాయామ ం చేయడం, ఆరోగ్యకరమైన ఆహార ం తీసుకోవడం, ఎక్కువగ ా నీళ్ల ు తీసుకోవడ ం మంచిదన ి వెంకటేష ్ అంటున్నారు.

పైక ి ధైర్యంగ ా కనిపించిన ా క్యాన్సర ్ అనగాన ే చాలామందిల ో ఎంత ో కొంత బెరుకు, భయ ం ఉంటాయని, అయిత ే డాక్టర్ల కౌన్సెలింగ ్ ఆ భయాల నుంచ ి బయటపడటానిక ి సాయపడుతుందన ి ఆయన చెబుతున్నారు.

క్యాన్సర్ స్క్రీనింగ్

ఫొట ో సోర్స్, Getty Images

వంశపారంపర్యంగ ా వస్తుందా?

పేగ ు క్యాన్సర్‌న ు తొల ి దశలోన ే గుర్తించాలంట ే ఫ్యామిల ీ క్యాన్సర్ ‌ హిస్టరీన ి పరిగణనలోక ి తీసుకోవాలి. ముఖ్యంగ ా రక్తసంబంధీకులు, బాగ ా దగ్గర ి కుటుంబ సభ్యుల్ల ో ఎవరైన ా కొలన ్ క్యాన్సర ్ బారిన పడ్డార ా అనేద ి తెలుసుకోవాలి.

కుటుంబ చరిత్రల ో పేగ ు క్యాన్సర ్ ఉన్నంత మాత్రాన తర్వాత తర ం వారిక ి కచ్చితంగ ా వస్తుందన ి చెప్పడానిక ి స్పష్టమైన ఆధారాల ు లేనప్పటిక ీ 10 శాత ం అవకాశ ం ఉండొచ్చన ి డాక్టర ్ అజయ ్ చాణక్య అన్నారు.

కడుపుల ో ఏదైన ా సమస్యత ో వైద్యులన ు సంప్రదిస్త ే కుటుంబంల ో ఎవరైన ా పేగ ు క్యాన్సర ్ బారిన పడ్డార ా అనేద ి చర్చించాలన ి సూచిస్తున్నారు. ఇల ా వ్యాధిన ి త్వరగ ా గుర్తించడమ ే కాకుండ ా నయ ం చేస ే అవకాశాల ు ఎక్కువగ ా ఉంటాయన ి చెబుతున్నారు.

అయిత ే ఫ్యామిల ీ హిస్టర ీ ఉందన ి తెలిస్త ే ఆరోగ్యకరమైన జీవన విధానాన్న ి పాటించడం, ఫైబర ్ ఎక్కువగ ా ఉండ ే ఆహారాన్న ి తీసుకోవడం, కొవ్వ ు పదార్థాలన ు తగ్గించడం, రోజుక ు 6 నుంచ ి 8 గ్లాసుల నీళ్ల ు తాగడ ం వంట ి జాగ్రత్తల ు తీసుకోవాలన ి వైద్యుల ు సూచిస్తున్నారు.

అమెరికాల ో కామన్‌గ ా కనిపించ ే క్యాన్సర్‌లల ో మూడ ో స్థానంల ో ఉంద ి పేగ ు క్యాన్సర్. అలాగ ే అక్కడ ి క్యాన్సర ్ మరణాలక ు రెండ ో ప్రధాన కారణ ం ఇది.

క్యాన్సర్

ఫొట ో సోర్స్, Getty Images

పేగ ు క్యాన్సర్‌క ు కారణాలు

దీనిక ి కారణాలేంటన ే దానిప ై స్పష్టత లేకపోయినప్పటిక ీ కొన్న ి అంశాల ు మాత్ర ం బోవెల ్ క్యాన్సర్‌క ి కారణాల ు కావచ్చన ి డాక్టర్ల ు పరిగణిస్తున్నారు.

  • సిగరెట్ల ు తాగడం
  • ఆల్కహాల ్ ఎక్కువగ ా తీసుకోవడం
  • ఊబకాయం
  • విపరీతమైన చిరుతిండ్లు
  • ప్రాసెస్డ ్ ఫుడ్స్, ప్రాసెస్డ ్ మీట్, జంక ్ ఫుడ ్ అతిగ ా తీసుకోవడం
  • కడుపుల ో క్యాన్సర్ ‌ పాలిప్స ్ ఉండటం
  • అనారోగ్యకరమైన జీవన విధానం

మహిళలత ో పోలిస్త ే పురుషులలోన ే ఈ రక ం క్యాన్సర ్ ఎక్కువగ ా కనిపిస్తోందన ి వైద్య నిపుణుల ు చెబుతున్నారు. పురుషుల్ల ో ఎక్కువగ ా కనిపించడానిక ి వార ి జీవన విధాన ం కూడ ా ఓ కారణమన ి అంటున్నారు.

అయిత ే పేగ ు క్యాన్సర ్ లక్షణాల ు కనిపిస్త ే వెంటన ే డాక్టర్‌న ు సంప్రదించడం, క్యాన్సర ్ స్క్రీనింగ్‌క ు వెళ్లడ ం మంచిది.

లక్షణాల ు ఎల ా ఉంటాయి?

పేగ ు క్యాన్సర ్ ఉన్న వ్యక్తుల్ల ో కడుపుల ో ఎప్పుడ ూ ఇబ్బందిగ ా ఉంటుంది.

  • మలంల ో రక్త ం పడుతుంది, నలుపురంగుల ో కనిపిస్తుంది.
  • ఎక్కవసార్ల ు మలవిసర్జన చేయాల్స ి రావచ్చు.
  • మల విసర్జన తర్వాత కూడ ా పొట్ట భారంగాన ే ఉన్నట్ట ు అనిపిస్తుంది.
  • విరేచనాల ు లేద ా మలబద్దక ం వంట ి సమస్యల ు వస్తాయి.
  • విరేచనంత ో పాట ు మ్యూకస ్ అంట ే జిగుర ు పడుతుంది.
  • పొట్ట కింద భాగంల ో నొప్పిగా, ఇబ్బందిగ ా ఉంటుంది.
  • సరైన ఆహార ం తీసుకున్న ా బరువ ు తగ్గుత ూ ఉంటారు.
  • ఎప్పుడ ూ నీరసంగా, అలసటగ ా ఉండటం, దేనిప ై ఏకాగ్రత లేకపోవడం.

రోజువార ీ జీవన విధానంల ో మార్పుల ు చేసుకోవడ ం వలన మన ం కొలన ్ క్యాన్సర ్ ముప్పున ు కొంతవరక ు తగ్గించుకోవచ్చు.

పళ్లు, కూరగాయలు, పప్ప ు ధాన్యాల్ల ో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంట ీ ఆక్సిడెంట్ల ు పుష్కలంగ ా ఉంటాయి. కాబట్ట ి మన రోజువార ీ ఆహారంల ో ఇవన్న ీ ఉండేల ా చూసుకోవాలి.

ఆల్కహాల్, సిగరెట్లక ు వీలైనంత దూరంగ ా ఉండాలి.

రోజ ూ కనీస ం 10 నిమిషాల పాట ు వ్యాయామ ం చేయడ ం మంచిది.

మన శరీర బరువ ు ఎప్పుడ ూ అదుపుల ో ఉండేల ా చూసుకోవాలి.

తిన్న ఆహార ం పూర్తిగ ా అరిగేల ా అవసరమైనంత నీర ు తాగడంత ో పాట ు ప్రతిరోజ ు విరేచనానిక ి వెళ్లాలి. కొంతమంద ి బాగ ా ఇబ్బందిగ ా అనిపించ ే వరక ు బాత్రూంక ి వెళ్లరన ి దాన ి వలన మలబద్ధక ం పెరిగి, ఇటువంట ి సమస్యలక ు దారితీస ే ప్రమాదముందన ి అపోల ో హాస్పిటల ్ అంకాలజిస్ట ్ డాక్టర ్ అజయ ్ చాణక్య వివరించారు.

( బీబీస ీ కోస ం కలెక్టివ ్ న్యూస్‌రూమ ్ ప్రచురణ )