SOURCE :- BBC NEWS
ఒక గంట క్రితం
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ స్మితా పాటిల్.
చరణ్‌దాస్ చోర్, నిషాంత్, మంథన్, భూమిక వంటి సినిమాల్లో స్మితా పాటిల్ మెరిశారు.
1956లో జన్మించిన ఆమె, మొదటి బిడ్డకు జన్మనిచ్చాక 1986లో చనిపోయారు.
తాను చనిపోయాక తనను పెళ్లికూతురిలా అలంకరించాలనేది స్మితా పాటిల్ ఆఖరి కోరిక.
స్మితా పాటిల్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా.. మిర్చ్ మసాలా. ఆ సినిమాను ప్రత్యేకంగా గుజరాత్‌లో మిర్చి సీజన్‌లోనే చిత్రీకరించారు.
రాజ్ బబ్బర్‌తో వివాహం స్మితా పాటిల్ తల్లికి ఇష్టం లేదు.
డిసెంబర్ 13, 1986న కుమారుడు ప్రతీక్ బబ్బర్‌కు జన్మనిచ్చి స్మితా పాటిల్ కన్నుమూశారు. ఆమె మెదడుకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు.
( ఈ కథనం అక్టోబర్ 17, 2017లో తొలిసారి బీబీసీ తెలుగులో ప్రచురితమైంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)