SOURCE :- BBC NEWS

సంధ్య థియేటర్‌ ఘటనపై రేవంత్‌రెడ్డి, అల్లు అర్జున్ ఏమని స్పందించారు?

ఒక గంట క్రితం

పుష్ప 2 సినిమా విడుదలకు ముందు రోజున సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు అల్లు అర్జున్ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందంటూ పోలీసులు చెప్పినా ఆయన వినలేదని అన్నారు. అంతకుముందు కొన్ని రోజుల కిందట రేవంత్ ఓ జాతీయ మీడియా చానల్‌తో మాట్లాడినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు.

అనంతరం కొద్ది గంటల్లోనే అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయన వ్యాఖ్యలకు సమాధానాలు ఇచ్చారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తన దగ్గరకు పోలీసులు ఎవరూ రాలేదని అల్లు అర్జున్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, TSASSEMBLY/ UGC