SOURCE :- BBC NEWS

సైఫ్ అలీ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

2 గంటలు క్రితం

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది.

రాత్రి 2.30 గంటలకు (తెల్లవారితే గురువారం) ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడని పోలీసులు చెప్పారు.

ఈ దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

”గుర్తు తెలియని ఒక వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత, సైఫ్ అలీ ఖాన్‌కు, ఆ దుండగుడికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సైఫ్‌ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం” అని ముంబయి జోన్ 8 డీసీపీ దీక్షిత్ గోడామ్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

సైఫ్ టీమ్ నుంచి వెల్లడైన అధికారిక ప్రకటనలో ఏముంది?

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 1

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 1

ఈ ఘటనపై సైఫ్ అలీ ఖాన్ టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

”సైఫ్ అలీ ఖాన్‌ నివాసంలో ఓ దుండగుడు చోరీకి యత్నించాడు. ప్రస్తుతం సైఫ్ ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా, అభిమానులు శాంతంగా ఉండాలని మేం అభ్యర్థిస్తున్నాం. ఇది పోలీసులు చూసుకునే విషయం. పరిస్థితిపై మేం అప్‌డేట్ అందిస్తుంటాం” అని ఆ ప్రకటనలో తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ పీఆర్ ఏజెన్సీ కూడా ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది.

”గత రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల ఇంట్లో చోరీ యత్నం జరిగింది. దొంగను అడ్డుకోబోయిన సైఫ్ చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ బాగున్నారు. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు. ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయొద్దు” అని కరీనా కపూర్ పీఆర్ ఏజెన్సీ అభ్యర్థించింది.

లీలావతి ఆస్పత్రి సీఓఓ ఏం చెప్పారు?

”తెల్లవారుజామున మూడున్నర గంటలకు సైఫ్ అలీ ఖాన్‌‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారు” అని లీలావతి ఆస్పత్రి సీఓఓ డాక్టర్ నీరజ్ ఉత్తామణి చెప్పారు.

‘‘సైఫ్‌ శరీరంపై ఆరు కత్తి గాట్లు ఉన్నాయి. రెండు లోతుగా దిగాయి. ఒకటి వెన్నెముకకు దగ్గరగా తగిలింది. న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ దాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీల ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది’’ అని తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఆందోళన కలిగించే విషయం

ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, ”సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఆందోళన కలిగించే విషయం. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాలి” అని అన్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 2

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 2

కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ కూడా ఈ ఘటనపై స్పందించారు.

”ఈ దాడి నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ముంబయిలో ఏం జరుగుతోంది? సురక్షితమైన ప్రాంతంగా పేరొందిన బాంద్రాలో ఇలా జరగడం ఆందోళన కలిగించే విషయం” అని మండిపడ్డారు.

”రోజురోజూ ముంబయిలో హింస, దొంగతనాలు, కత్తిపోట్లకు సంబంధించిన ఘటనల గురించి ఎక్కువగా వింటున్నాం. ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాధానాలు లేవు. మాకు సమాధానాలు కావాలి” అని గైక్వాడ్ అన్నారు.

పోస్ట్‌ Twitter స్కిప్ చేయండి, 3

Twitter ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Twitter అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Twitter కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Twitter ముగిసింది, 3

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)