SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Reuters
7 మే 2025, 06:13 IST
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో, భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించిందని బుధవారం తెల్లవారుజామున భారత ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ఆపరేషన్ పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని, అక్కడి నుంచే భారత్‌పై తీవ్రవాదులు దాడులకు ప్రణాళిక రచించి, అమలు చేశారని ప్రభుత్వం తెలిపింది
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది


ఫొటో సోర్స్, Getty Images
మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు భారత సైన్యం మూడు చోట్ల క్షిపణులతో పాక్‌పై దాడి చేసిందని ఆర్మీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగినప్పటి నుంచి భారత్- పాక్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి.
ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సహా 26 మంది చనిపోయారు.
పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రాంతాలలో భారత సైన్యం దాడులు చేసిన ప్రాంతాలను బీబీసీ ఇంకా స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది.
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత సైన్యం పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్-రజౌరీ సెక్టార్‌లోని ‘భీంబర్ గలీ’లో పాక్ కాల్పులకు పాల్పడిందని భారత సైన్యం ఎక్స్‌లో తెలిపింది.
భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
‘‘మా చర్యలు కచ్చితత్త్వంతో, ఉద్రిక్తతలు తలెత్తని రీతిలో ఉన్నాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలను వేటినీ లక్ష్యంగా చేసుకోలేదు’’ అని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS