SOURCE :- BBC NEWS

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, PTI

ఒక గంట క్రితం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ, అంతర్జాతీయ సరిహద్దుతో పాటు పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొరా, నగ్రోటా , జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, లాలాగఢ్ జట్టా, జైసల్మేర్, బర్మేర్, భుజ్, క్వార్‌బెట్, లఖీ నాలా ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయని పేర్కొంది.

”దురదృష్టవశాత్తూ, సాయుధ డ్రోన్ ఫిరోజ్‌పుర్‌లో నివాసిత ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో స్థానికంగా నివసించే ఓ కుటుంబంలోని కొందరికి తీవ్రగాయాలయ్యాయి. వారికి చికిత్స అందుతోంది.ఆ ప్రాంతాన్ని సాయుధ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.”

”భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇలాంటి గగతనతల దాడులన్నింటినీ ట్రాక్ చేస్తూ, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలతో నిర్వీర్యం చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతాపరమైన సూచనలను తప్పనిసరిగా పాటించాలి” ఆర్మీ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
జమ్మూకశ్మీర్, పాకిస్తాన్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

గ్రౌండ్ నుంచి బీబీసీ ప్రతినిధులు చెప్పిన వివరాలు..

పంజాబ్‌లోని సరిహద్దు పట్టణాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పఠాన్‌కోట్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నామని, ఆకాశంలో వెలుగులు చూశామని బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ చెప్పారు.

“డ్రోన్‌ దాడులు జరిగాయని, వాటిని కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత సైన్యం తెలిపింది. ప్రతిచోటా బ్లాకౌట్ ఉంది” అని జుగల్ అన్నారు.

అమృత్‌సర్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి రవీందర్ సింగ్ రాబిన్ మాట్లాడుతూ, “నగరంలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పేలుళ్లు వినిపించాయి. దీంతో పాటు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో డ్రోన్లు కూడా కనిపించాయి. కాల్పుల శబ్దాలు వినిపించాయి. అయితే, ఇప్పటివరకు ఈ దాడిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెప్పారు” అని తెలిపారు.

“నిన్న, ఈరోజు పూంఛ్‌లో భారీ షెల్లింగ్ జరిగింది. ఇందులో ఒకరు మరణించారు, కొంతమంది గాయపడ్డారు. అయితే, సరిహద్దుకి కొంచెం దూరంలో సురాన్‌కోట్ ఉంది, ఇక్కడ షెల్లింగ్ ప్రభావం పెద్దగా లేదు” అని పూంఛ్ సమీపంలోని సురాన్‌కోట్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి రాఘవేంద్రరావు చెప్పారు.

జమ్మూలో పేలుళ్లు సంభవించాయని స్థానిక ప్రజలు చెప్పినట్లు జమ్మూలో ఉన్న బీబీసీ ప్రతినిధి దివ్య చెప్పారు.

“ఈ ప్రాంతంలో నిశ్శబ్దం ఉంది, ప్రజలు తమ ఇళ్లలో ఉన్నారు. పగటిపూట పరిస్థితి సాధారణంగా ఉంది. మార్కెట్లలో ప్రజలు కనిపించారు కానీ, సాయంత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది” అని దివ్య అన్నారు.

శ్రీనగర్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ మాట్లాడుతూ “శ్రీనగర్, అవంతిపొరలో చాలా పేలుళ్లు వినిపించాయి. అలాగే, కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు” అని అన్నారు.

భారత్, పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

అంతకుమందు, జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌లలో డ్రోన్‌లు కనిపించాయని భారత ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఫిరోజ్‌పూర్‌లో మూడు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు స్థానికులు చెప్పారని పంజాబ్‌లోని బీబీసీ జర్నలిస్టులు తెలిపారు. ఫిరోజ్‌పూర్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా తాను మూడు పేలుళ్ల శబ్దం విన్నట్లు ధ్రువీకరించారు.

బీబీసీ జర్నలిస్ట్ నవజ్యోత్ కౌర్ ప్రకారం, చండీగఢ్‌లో డిప్యూటీ కమిషనర్ నిషాంత్ యాదవ్ ఆదేశాలతో రాత్రి 7 గంటలకే మార్కెట్లు మూసివేశారు.

కుప్వారా, ఉరి, పూంచ్‌ ప్రాంతాల్లో రాత్రి 7 గంటల 20 నిమిషాల ప్రాంతంలో శబ్దాలు ప్రారంభమయ్యాయని శ్రీనగర్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

జమ్మూలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, సైరన్లు మోగుతున్నాయని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

“జమ్మూలో బ్లాకౌట్ ఉంది, నగరం అంతటా సైరన్‌లు వినిపిస్తున్నాయి” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆయన పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పాకిస్తాన్ డ్రోన్ దాడిలో ఫిరోజ్‌పూర్‌లోని ఓ కుటుంబం గాయపడినట్లు వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

“బాధితుల్లో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది, ఆమెకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మిగతా ఇద్దరికి తక్కువ గాయాలున్నాయి. మేం వెంటనే వారి చికిత్సను ప్రారంభించాం. వారు ఒకే కుటుంబానికి చెందినవారు” అని డాక్టర్ కమల్ బాగి చెప్పినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3

X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)