SOURCE :- BBC NEWS

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్

ఫొటో సోర్స్, ANI

‘’ఆపరేషన్ సిందూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు’’ అని భారత డైరెక్టర్
జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘయ్ తెలిపారు.

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు కుదిరిన ఒప్పందం తర్వాత, భారత సైన్యం ఆదివారం సాయంత్రం విలేఖరుల సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో, ఆర్మీ నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైమానిక
దళం నుంచి ఎయిర్ మార్షల్ ఏకే భారతి, నేవీ నుంచి వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్
జనరల్ ఎస్ఎస్ శార్దా పాల్గొని ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపారు.

“సైన్యం తొమ్మిది ఉగ్రవాద
స్థావరాలపై కచ్చితమైన లక్ష్యంతో దాడి చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా
ఉగ్రవాదులు మరణించారు. వీరిలో యూసుఫ్ అజార్, అబ్దుల్
మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ వంటి ఉగ్రవాదులున్నారు” అని రాజీవ్
ఘయ్ చెప్పారు.

“ఐసీ 814 హైజాక్,
పుల్వామా పేలుళ్లలో ఈ ముగ్గురి హస్తముందని” రాజీవ్ ఘయ్ అన్నారు.

“భారత్ దాడుల అనంతరం, నియంత్రణ రేఖను కూడా పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఇది శత్రువు భయాందోళనతో కూడిన ప్రతిచర్య. పెద్ద సంఖ్యలో పౌరులు, గ్రామాలు,
గురుద్వారాల వంటి మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో చాలామంది పౌరులు
ప్రాణాలు కోల్పోయారు” అని ఆయన అన్నారు.

SOURCE : BBC NEWS