SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, EPA
- రచయిత, టామ్ బాట్‌మ్యాన్
- హోదా, స్టేట్ డిపార్ట్మెంట్ కరెస్పాండెంట్
-
13 జూన్ 2025
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో బెంజమిన్ నెతన్యాహు, డోనల్డ్ ట్రంప్ మధ్య ఘర్షణ వాతావరణం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇరాన్‌తో ట్రంప్ కార్యాలయం అణు చర్చలను జరుపుతున్న నేపథ్యంలో, దాడులు చేయడం తనకు ఇష్టం లేదని, కొన్ని రోజులు వేచిచూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
మరోవైపు, ఇరాన్‌పై దాడులు చేసేందుకు తమకు లభించిన మంచి అవకాశం ఇదేనని ఇజ్రాయెల్ భావిస్తోంది.
లెబనాన్‌లో హిజ్బొల్లాను దెబ్బతీసిన తర్వాత, ఈ ప్రాంతంలో ఇరానియన్ల ప్రాబల్యం ఎంత క్షీణించిందో, ప్రస్తుత పరిస్థితి కూడా అలానే ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఒకవేళ అమెరికన్లకు నచ్చకపోయినా ఇదే సరైన సమయం అని నెతన్యాహు భావించారు.
సైనిక దాడులు వెలుగులోకి వచ్చిన తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఒక కీలక ప్రకటన చేశారు.
‘‘ఇరాన్‌పై మా మిత్ర దేశం ఏకపక్ష చర్యలు ప్రారంభించింది. ఈ దాడులతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు’’ అని మార్కో రూబియో చెప్పారు.
”ఇరాన్‌పై దాడులకు మాకెలాంటి సంబంధం లేదు. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యం” అని అన్నారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడి తమ స్వీయ రక్షణకు అవసరమైన చర్యగా ఇజ్రాయెల్ చెప్పినట్లు రూబియో తెలిపారు.
ప్రస్తుతానికి, ఈ సైనిక చర్య నుంచి దూరంగా ఉన్నట్లు వైట్‌హౌస్ బహిరంగంగానే చెప్పింది. ఈ ఘర్షణల నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
గత సంవత్సరం ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో ఘర్షణలను ఉధృతం చేసినప్పుడు కూడా ఇదే రకమైన విధానాన్ని అనుసరించింది.
అయితే, ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తూ ఈ నష్టాన్ని తగ్గించేందుకు అమెరికా సాయపడింది. కానీ, తనంతట తాను ఈ ఘర్షణల్లో పాలుపంచుకోకపోవడం కీలకం.
గురువారం దాడులకు కొన్ని గంటల ముందు, ఇజ్రాయెల్ దాడులకు దిగితే అమెరికా నుంచి ఎలాంటి మద్దతు ఉండదని అమెరికా అధికారులు హెచ్చరించారు.
అంతేకాక, ఏరియల్ రీఫ్యూయలింగ్‌కు కూడా సహకరించేది లేదని తేల్చిచెప్పారు.
రూబియో ప్రకటన ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలపై దాడులను నిరోధించేందుకు అమెరికా దూరంగా ఉండేందుకు వ్యవహరించిందా లేదా ఇటీవల ట్రంప్, నెతన్యాహుకు మధ్య పెరుగుతున్న ఘర్షణకు సంకేతమా అనే దానిపై స్పష్టత లేదు.
ఇరాన్ ప్రతి దాడులు చేస్తే ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుందో అనే దానిపై కూడా రూబియో తన ప్రకటనలో ప్రస్తావించలేదు.
అయితే, అమెరికన్లు అనివార్యంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా పనిచేస్తారు. కానీ, ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోవడం అసాధారణంగానే ఉంది.

ఫొటో సోర్స్, EPA
అయితే, అమెరికా నుంచి తమకు పూర్తి సహకారం లభించినట్లు దాడులకు ముందు ఇజ్రాయెల్ చెప్పింది.
ఇరాన్లో అధికారులకు కూడా రూబియో హెచ్చరికలు జారీ చేశారు. ”అమెరికా ప్రయోజనాలను లేదా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోకూడదు” అని ఆయన అన్నారు.
అయితే, ఇజ్రాయెల్ మద్దతుగా సాయం చేసేందుకు అమెరికన్లు ఎలాంటి సాయం చేస్తారన్నదే ప్రశ్నార్థకం.
గత ఏడాది అమెరికాను ఈ ఘర్షణల్లోకి లాగిన తర్వాత జరిగిన రెండు సందర్భాలను మనం చూశాం. పరిస్థితుల చాలా వేగంగా చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.
ఇజ్రాయెల్ మిత్రదేశాల నుంచి గత ఏడాది వచ్చిన మాదిరి ఈ ఏడాది కూడా అదే రకమైన సహకారం లభిస్తుందని అనుకోవడం లేదు.
ఈ దాడులు చాలా వేగంగా…అనియంత్రిత స్థాయిలో జరిగాయి.
రాబోయే గంటలు, రోజులు కచ్చితంగా చాలా కీలకం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS